English News Headline
Telangana CM Revanth Reddy Celebrates Dussehra with Villagers in Kondareddypally

Full Telugu News Article
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో గ్రామస్థులతో కలిసి విజయదశమి వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజల మధ్య ఆత్మీయంగా గడుపుతూ పండుగ సంబరాలను పంచుకున్నారు.
గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రికి స్థానికులు ఆప్యాయంగా స్వాగతం పలికారు. పెద్దలు, చిన్నారులను పలకరిస్తూ గ్రామస్థులతో ముచ్చటించారు. దీంతో కొండారెడ్డిపల్లిలో పండుగ సందడి మరింత పెరిగింది.
సాయంత్రం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలోని కోట మైసమ్మ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, గ్రామస్థులతో కలిసి కాలినడకన జమ్మి చెట్టు వద్దకు చేరుకున్నారు.
అక్కడ సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. దారిపొడవునా గ్రామస్థులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
గ్రామంలో బతుకమ్మ ఆటపాటలు, సంప్రదాయ ఆచారాలు, ఆత్మీయ పలకరింపులతో విజయదశమి వేడుకలు సందడిగా జరిగాయి. ముఖ్యమంత్రి తన సొంత గ్రామ ప్రజలతో కలిసి పండుగ జరుపుకోవడం ఈ వేడుకలకు ప్రత్యేకతను తీసుకొచ్చింది.
Full English News Article
Telangana Chief Minister Revanth Reddy celebrated Vijayadashami with villagers in his native village of Kondareddypally, sharing the festive spirit with local residents and family members.
The Chief Minister interacted warmly with villagers, greeting elders and children and spending time among the local community. His visit added to the festive atmosphere in the village, where residents welcomed him with affection.
In the evening, Revanth Reddy visited the Kotta Maisamma Temple with his family and performed special prayers. He later walked alongside public representatives and villagers to a Jammi tree, where traditional rituals were performed.
The Chief Minister greeted residents along the way, making the celebrations an occasion for community interaction and cultural traditions.
Bathukamma songs and dances, traditional rituals and festive gatherings marked Vijayadashami celebrations in Kondareddypally. The occasion highlighted the importance of village traditions and the bond between the Chief Minister and the people of his native village.