Telangana Bars Lucky Draw: Winners Selected for 41 Licences
elangana Bars Lucky Draw: Winners Selected for 41 Licences

తెలంగాణలో 41 బార్ల లైసెన్సుల కేటాయింపు కోసం నిర్వహించిన లక్కీ డ్రా ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ బార్ల కోసం మొత్తం 8,770 దరఖాస్తులు రాగా, ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణలో విజేతలను ఎంపిక చేశారు.
హైదరాబాద్లోని ది అడ్రస్ కన్వెన్షన్ హాల్లో జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి పరిధిలోని 14 బార్లకు లక్కీ డ్రా నిర్వహించారు. ఈ బార్ల కోసం 4,251 దరఖాస్తులు వచ్చాయి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ సమక్షంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. దరఖాస్తుదారుల సమక్షంలో విజేతలను ఎంపిక చేసి, ఫలితాలను మైకులో ప్రకటించడంతో పాటు స్క్రీన్పై ప్రదర్శించారు.
జిల్లాల్లోనూ లక్కీ డ్రా పూర్తి
రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని మరో 27 బార్లకు కూడా లక్కీ డ్రా నిర్వహించారు. ఈ బార్ల కోసం 4,519 దరఖాస్తులు వచ్చాయి. ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఖమ్మం, మహబూబ్నగర్, సంగారెడ్డి, వరంగల్ సహా పలు జిల్లాల్లో విజేతలను ప్రకటించారు.
లక్కీ డ్రా ప్రక్రియ ప్రశాంతంగా ముగియడానికి సహకరించిన దరఖాస్తుదారులతో పాటు విధులు నిర్వహించిన ఎక్సైజ్ అధికారులు, సిబ్బందిని కమిషనర్ సి. హరికిరణ్ అభినందించారు.
Telangana Completes Lucky Draw for 41 Bar Licences; 8,770 Applications Received
Telangana has completed the lucky draw process for allocating licences to 41 bars across the state. A total of 8,770 applications were received, with winners selected under the supervision of excise officials.
A lucky draw was conducted at The Address Convention Hall in Hyderabad for 14 bars under the GHMC, Cyberabad and Malkajgiri jurisdictions. These bars attracted 4,251 applications. Prohibition and Excise Commissioner C. Harikiran attended the process, during which the selected winners were announced and displayed on a screen.
Draw Completed for 27 Bars in Districts
The remaining 27 bars in various municipalities and municipal corporations attracted 4,519 applications. The draws were conducted in the presence of the respective district collectors.
Winners were announced in several districts, including Khammam, Mahabubnagar, Sangareddy and Warangal. Commissioner C. Harikiran appreciated the applicants for their cooperation and commended excise officials and staff for completing the process peacefully.