మహిళల భద్రత, సైబర్ నేరాలు, లోన్ యాప్ మోసాలు, బాలల హక్కులపై మల్కాజిగిరి షీ టీమ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించాయి. నేరేడ్మెట్లోని తనిష్క్ గోల్డ్ అండ్ డైమండ్స్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు సామాజిక సమస్యలు, వాటి నివారణ చర్యలపై వివరించారు.
మహిళల భద్రత కోసం షీ టీమ్స్ అందిస్తున్న సేవలు, సైబర్ నేరాలు, లోన్ యాప్ మోసాలు, సీడీఈడబ్ల్యూ (CDEW) కౌన్సెలింగ్ కేంద్రాలు, మానవ అక్రమ రవాణా, లింగ సమానత్వంపై అవగాహన కల్పించారు. అలాగే సీసీటీవీ కెమెరాల ప్రాధాన్యం, బాల్యవివాహాలు, బాలలపై వేధింపులు, ర్యాగింగ్ నివారణ, గుడ్ టచ్–బ్యాడ్ టచ్ వంటి అంశాలను వివరించారు.
కేస్ స్టడీలు, అవగాహన వీడియోల ద్వారా పాల్గొన్నవారికి వివిధ నేరాలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో 112 నంబర్కు, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నంబర్ 8712662111కు, సైబర్ నేరాలపై ఫిర్యాదుల కోసం 1930 హెల్ప్లైన్కు సంప్రదించాలని సూచించారు.
మహిళలు, పిల్లల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మల్కాజిగిరి పోలీసులు తెలిపారు.
Malkajgiri SHE Teams Conduct Women’s Safety Awareness Programme in Neredmet
Malkajgiri SHE Teams conducted an awareness programme at Tanishq Gold & Diamonds in Neredmet, focusing on women’s safety, cybercrime, loan app frauds and child protection. The programme covered a range of social concerns and measures to prevent offences.
Participants were sensitised to SHE Teams services, CDEW counselling centres, human trafficking, gender sensitisation, the importance of CCTV cameras, child marriages, child abuse, anti-ragging measures and good touch and bad touch. Case studies and awareness videos were used to explain the issues and help participants recognise potential risks.
The police advised participants to contact 112 in emergencies, the Malkajgiri Commissionerate WhatsApp number 8712662111 for assistance, and the 1930 cybercrime helpline to report cyber financial fraud.
Malkajgiri Police reiterated their commitment to promoting public awareness and protecting women and children through outreach initiatives.