తడిసిన ధాన్యానికి గాను రైతులకు నష్టపొయిన పరిహారాన్ని చెల్లించాలి
సెక్రటేరియట్ ముట్టడికి బయలుదేరిన ప్రజా సంఘాలు..
అడ్డుకున్న పోలీసులు ..అరెస్ట్
అరెస్టు చేసిన వారిని వెంటనే బెషరుతుగా విడుదల చేయాలి!: ఆకునూరి మురళి
హైదరాబాద్ : ఆకాల వర్షానికి పంట నష్టపొయిన రైతులకు పరిహారాన్ని చెల్లించాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి సెక్రటేరియట్ కు బయలుదేరి న వాలింటరి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, ప్రోపెసర్ కొందండరామ్, క్రాంతి దళ్ అధ్యక్షులు పృధ్విరాజ్, బీసీ సంఘం అధ్యక్షులు బొల్క వెంకట్ యాదవ్,డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన,ఆర్‌ఎస్వి నాయకులు రవి,కిరణ్, ఎన్‌ఏపిఎం నాయకులు విూర సంఘమిత్ర,టివివి నేత నాగన్న లను అక్రమ అరెస్టులను దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని ,ప్రశ్నించే తత్వాన్ని అణిచివేయాలని చూస్తున్న ప్రభుత్వానికి తగిన గుణపాఠం చేప్పాలని,వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల వరిధాన్యానికి మద్దతు ధర ప్రకటించి,తడిసిన ధాన్యాన్ని యుద్ధ పాతిపాధికన కొనుగోలు చేసి రైతాంగాన్ని అదుకోవాలని,అరెస్టు చేసిన నాయకులందరిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.