సైబరాబాద్ 5K Runలో 6,100 మంది.. ఆరోగ్యం, సామాజిక బాధ్యతపై సీపీ రమేష్…

6,100 Join Hyderabad 5K Run

ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు సామాజిక బాధ్యతపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ అన్నారు. రోహిణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన NMDC Hyderabad Marathon–2026లో భాగంగా HICC నుంచి HITEX వరకు నిర్వహించిన 5K Runలో సుమారు 6,100 మంది పాల్గొన్నారు.

“Run for a Cause” సందేశంతో నిర్వహించిన ఈ పరుగు కార్యక్రమం ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా సాగింది. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నప్పటికీ నిర్వాహకులు, పోలీసు సిబ్బంది సమన్వయంతో కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది.

కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, CMC కమిషనర్ సృజన, విద్యార్థులు, రన్నర్లు, సామాన్య ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డా. ఎం. రమేష్ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ శారీరక దృఢత్వంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. క్రమం తప్పకుండా పరుగు, నడక వంటి వ్యాయామాలు చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయడం ద్వారా సమాజంలో సేవాభావాన్ని మరింత పెంపొందించవచ్చని పేర్కొన్నారు.

పిల్లలు సెల్‌ఫోన్‌లకు ఎక్కువ సమయం కేటాయించకుండా పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకునేలా “సెల్‌ఫోన్ వద్దు – పుస్తకమే ముద్దు” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. కథల పుస్తకాలు, ఇతర పుస్తకాలు, రాత సామగ్రిని అవసరమైన వారికి అందించడం ద్వారా పిల్లల్లో పఠనాసక్తిని పెంచడంతో పాటు వారి జ్ఞానాన్ని విస్తరించేందుకు దోహదపడుతుందని తెలిపారు.

రోహిణి ఫౌండేషన్ చేపట్టిన “Power of 100” కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరి చిన్న సహకారం కూడా పెద్ద సానుకూల మార్పుకు దోహదపడుతుందనే సందేశాన్ని అందించారని చెప్పారు. “100 People – ₹100 Each – One Powerful Change” అనే భావనతో నిర్వహించిన ఈ కార్యక్రమం సామాజిక బాధ్యత, సమిష్టి భాగస్వామ్యం, సేవాభావాన్ని పెంపొందించేలా సాగింది.

కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన రోహిణి ఫౌండేషన్ నిర్వాహకులు, NMDC Hyderabad Marathon నిర్వాహకులు, రన్నర్లు, విద్యార్థులు, ప్రజలు, సైబరాబాద్ పోలీస్ సిబ్బందికి సైబరాబాద్ పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.


A healthy lifestyle must go hand in hand with social responsibility, Cyberabad Police Commissioner Dr. M. Ramesh said. Around 6,100 people participated in the 5K Run organised from HICC to HITEX as part of the NMDC Hyderabad Marathon–2026, organised by the Rohini Foundation.

Held with the message “Run for a Cause”, the event aimed to promote a healthy lifestyle while creating awareness about social service initiatives. Despite the large turnout, the event concluded peacefully and successfully without any untoward incidents, thanks to effective coordination between the organisers and police personnel.

Cyberabad Police Commissioner Dr. M. Ramesh, CMC Commissioner Srujana, students, runners and members of the public participated in the event.

Speaking on the occasion, Dr. M. Ramesh stressed the importance of physical fitness in building a healthy society. He encouraged people to regularly engage in physical activities such as running and walking to maintain good health. He also said greater public participation in social service initiatives would help strengthen the spirit of service in society.

He appreciated the campaign message “Cellphone Vaddhu – Pusthakame Muddu” (No Cellphone – Books First), aimed at encouraging children to spend less time on mobile phones and develop an interest in reading. Providing storybooks, other books and writing materials to those in need, he said, can encourage reading among children and help broaden their knowledge.

The “Power of 100” initiative by the Rohini Foundation highlighted how small contributions from individuals can collectively create a significant positive change. Built around the concept “100 People – ₹100 Each – One Powerful Change”, the initiative sought to promote social responsibility, collective participation and the spirit of service.

Cyberabad Police thanked the Rohini Foundation organisers, NMDC Hyderabad Marathon organisers, runners, students, members of the public and police personnel for their cooperation in making the event a success.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *