.English: CM Revanth Reddy urged Army authorities to establish district-level training centres to prepare Telangana youth for recruitment drives.

తెలంగాణ యువతకు భారత ఆర్మీ నియామకాల్లో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రాల్లో ముందస్తు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆర్మీ అధికారులను కోరారు.
Telangana Chief Minister A. Revanth Reddy said the state government is ready to work with the Indian Army to create more opportunities for Telangana youth in Army recruitment. He urged Army authorities to establish pre-recruitment training centres at selected district headquarters.
ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో భారత ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్, పలువురు ఆర్మీ ప్రతినిధులు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ ఎన్. శ్రీనివాస్ రావు, ఇతర ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా నిర్వహించే వివిధ ఆర్మీ నియామకాలకు ముందుగానే తెలంగాణలోని ఎంపిక చేసిన జిల్లా కేంద్రాల్లో యువతకు శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. దీనికి లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ సుముఖత వ్యక్తం చేశారు. ఆర్మీ రిక్రూట్మెంట్లకు సిద్ధమయ్యే యువత కోసం జిల్లా కేంద్రాల్లో శిక్షణా కేంద్రాల ఏర్పాటు చేపడతామని తెలిపారు.
దేశంలో విపత్తుల సమయంలో ఆర్మీ అందిస్తున్న సేవలను ముఖ్యమంత్రి అభినందించారు. తెలంగాణలో వరదల వంటి విపత్తుల సమయంలో రెస్క్యూ ఆపరేషన్లు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస చర్యల్లో ఆర్మీ మరింత చురుకుగా పాల్గొనాలని కోరారు. రాష్ట్రంలో విపత్తు పరిస్థితుల్లో ప్రత్యేకంగా స్పందించేలా స్థానిక ఆర్మీ అధికారులను ఆదేశిస్తానని రాజేష్ పుష్కర్ తెలిపారు.
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపైనా సమావేశంలో చర్చ జరిగింది. కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు చారిత్రక హైదరాబాద్ నగరానికి పూర్వవైభవాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో ప్రాజెక్టును చేపట్టడాన్ని లెఫ్టినెంట్ జనరల్ అభినందించారు. హైదరాబాద్ నగర పరిరక్షణకు మూసీ నది ప్రక్షాళన అవసరమని పేర్కొన్నారు.
The meeting also covered the Army’s role during natural disasters. The Chief Minister appreciated the Army’s contribution to rescue operations, evacuation and rehabilitation and urged greater support in flood-affected areas of Telangana.
Army authorities also expressed support for setting up district-level training centres to prepare local youth for recruitment drives conducted across the country. The meeting further discussed the Musi rejuvenation project and the need to restore and protect the river to improve Hyderabad’s environment and heritage