బోనాల సందర్భంగా అమ్మవార్లను దర్శించుకున్న కేటీఆర్

English News Headline

KTR Offers Prayers at Akkanna Madanna and Lal Darwaza Temples

Full Telugu News Article

బోనాల పండుగ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్‌లోని శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారి ఆలయంతో పాటు లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు కేటీఆర్ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు.

హైదరాబాద్‌లో వ్యాపారాలు బాగా జరగాలని కేటీఆర్ కోరుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులందరూ సంతోషంగా ఉండాలని ప్రార్థించారు.

తనను బోనాల వేడుకలకు ఆహ్వానించిన వారికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. పండుగ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

Full English News Article

BRS working president KTR visited the Sri Akkanna Madanna Mahankali temple and the Lal Darwaza Simhavahini temple in Hyderabad on the occasion of the Bonalu festival and offered special prayers.

KTR extended Bonalu greetings to the women, brothers and families of Telangana. He prayed that the blessings of the Goddess would be upon everyone.

He also wished for businesses in Hyderabad to prosper. KTR prayed for abundant rainfall with the blessings of the Goddess and expressed hope that farmers across the state would remain happy.

KTR thanked those who invited him to participate in the Bonalu celebrations and conveyed his greetings to people on the occasion of the festival.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *