నేచురల్‌ స్టార్‌ నాని, మృణాల్‌ ఠాకూర్‌, శౌర్యు : వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ చఔజీనితి 30లో శ్రుతి హాసన్‌

నేచురల్‌ స్టార్‌ నాని ల్యాండ్‌మార్క్‌ 30వ చిత్రం షూటింగ్‌ నూతన దర్శకుడు శౌర్యువ్‌ దర్శకత్వంలో శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం గోవాలో ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. సీతా రామం ఫేమ్‌ మృణాల్‌ ఠాకూర్‌ ఈ చిత్రంలో కథానాయిక. తాజాగా శృతి హాసన్‌ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. ఈ యేడాది ఆరంభంలో బ్లాక్‌ బస్టర్‌ వీరసింహారెడ్డితో అలరించిన శ్రుతి హాసన్‌ ఈరోజు గోవాలో షూటింగ్‌లో జాయిన్‌ అయింది. ఈ లెంతీ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మోహన్‌ చెరుకూరి (సివిఎం), డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తుండగా, కోటి పరుచూరి సిఒఒగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రంలో కొంతమంది ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సాను జాన్‌ వర్గీస్‌ ఎూఅ డీవోపీగా, హృదయం ఫేమ్‌ కంపోజర్‌ హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.
ప్రవీణ్‌ ఆంథోని ఎడిటర్‌ గా, అవినాష్‌ కొల్లా ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా, సతీష్‌ ఈవీవీ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ గా పని చేస్తున్నారు.
తారాగణం: నాని, మృణాల్‌ ఠాకూర్‌, శ్రుతి హాసన్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *