దేశంలో? అతిపెద్ద స్కాం ఆర్‌ ఆర్‌ ఆర్‌ లీజు.. రేవంత్‌ రెడ్డి


హైదరాబాద్‌ : 2004 లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారు. హైదరాబాద్‌ మహా నగరానికి మణిహారంగా ఔటర్‌ రింగ్‌ రోడ్‌ ను నిర్మించింది. ఇందుకోసం 6696 కోట్లు గత రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టిందని టీపీపీపీ ఛీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. శనివారం అయన విూడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఔటర్‌ రింగ్‌ రోడ్డును కాంగ్రెస్‌ నిర్మించింది. తెలంగాణకు పెట్టుబడులు పెడుతున్నారంటే… విమానాశ్రయం, ఔటర్‌ రింగ్‌ రోడ్‌ ప్రామాణికం. గత 4 సంవత్సరాల నుంచి టోల్‌ ను ఈగల్‌న్ఫ్ఫ్రా కు కట్టబెట్టారు. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ ను ఆదాయ వనరుగా కేటీఆర్‌ మిత్రబృందం ఉపయోగించుకుంది. ఈ ఆదాయాన్ని శాశ్వతంగా ఉపయోగించుకునెందుకు కేటీర్‌ కుటుంబం ఆలోచించింది. తమ కుటుంబానికి లాభం ఉండదని 30 సంవత్సరాలు ప్రయివేటు సంస్థకు కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డును కేటీఆర్‌ ప్రయివేటుకు తాకట్టు పెట్టారు. వేల కోట్ల ఆదాయం వచ్చే రింగ్‌ రోడ్‌ ను ప్రయివేటుకు అమ్మేశారు.పెట్టుబడులు అంటే నూతనన్ఫ్ఫ్రా స్ట్రక్చర్‌ ఏర్పాటు చేయాలి.కానీ ఉన్నవాటిని తాకట్టు పెట్టడం కాదు..కనీసం 30వేల కోట్లు ఆదాయం వచ్చే ఔటర్‌ 7380 కొట్లకే ముంబై కంపెనీకి తాకట్టు పెట్టారు.దీని వెనక సోమేశ్‌ కుమార్‌ వ్యవహారం నడిపాడు. అరవింద్‌ కుమార్‌ సంతకం పెట్టారు. దేశంలోనే ఇది అత్యంత పెద్ద కుంభకోణం. ఇందులో 1000 కోట్లు చేతులు మారాయి. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించదు. మేం అధికారంలోకి వచ్చాక మొట్టమొదట వీటిపై విచారిస్తాం. యాజమాన్యం కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నామని అన్నారు.
సోమేశ్‌ కుమార్‌, అరవింద్‌ కుమార్‌, జయేష్‌ రంజన్‌ నిర్ణయాలన్నింటిపై కాంగ్రెస్‌ పార్టీ సవిూక్షిస్తుంది. ఈ నిర్ణయాలపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉంది. ప్రజల ఆస్తులు కేసీఆర్‌ అమ్ముతుంటే బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి ఎందుకు స్పందించడం లేదు. దీనిపై బీజేపీ నేతలు కూడా స్పందించాలి. ప్రజలు ఔటర్‌ రింగ్‌ రోడ్‌ ను వినియోగించే పరిస్థితులు లేవు. టెండర్‌ విధానాలపై విచారణ సంస్థలన్నింటికి పిర్యాదు చేస్తాం. వాస్తవంగా ఇంతకు ముందు దీన్ని ఆదానికి కట్టబెట్టాలని చూశారు. ఆరోపణల నేపథ్యంలో ముంబై కంపెనీకి తాకట్టు పెట్టారని అన్నారు.
2018 నుంచి ఎవరికి టోల్‌ వసూలు బాధ్యత ఇచ్చారో హెచ్‌ఎండీఏ అధికారులు బయట పెట్టాలి. ప్రజలకు అవసరమయ్యే ఔటర్‌ రింగ్‌ రోడ్‌ ను ఇప్పుడు అమ్మాల్సిన అవసరం ఏం వచ్చిందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *