English: World Population Day 2026: Healthy Pregnancy Spacing for Strong Families

ప్రపంచ జనాభా దినోత్సవం: ఆరోగ్యకరమైన కుటుంబాలకు గర్భధారణల మధ్య తగిన విరామం అవసరం
లీడ్:
తెలుగు: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఆరోగ్యకరమైన కుటుంబాలు, సురక్షిత భవిష్యత్తు కోసం గర్భధారణల మధ్య తగిన విరామం పాటించాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది.
English: On World Population Day, the Government of India urged families to maintain healthy spacing between pregnancies for better maternal and child health and a secure future.
ఆరోగ్యవంతమైన తల్లి, ఆరోగ్యంగా ఎదిగే బిడ్డ, సంతోషకరమైన కుటుంబ జీవనం కోసం గర్భధారణల మధ్య తగిన విరామం ఎంతో కీలకమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సరైన వ్యవధిలో పిల్లలు జన్మిస్తే కుటుంబ ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు కుటుంబ సంక్షేమం, ఆర్థిక స్థిరత్వం కూడా పెరుగుతుందని వెల్లడించింది.
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కుటుంబ నియంత్రణ, గర్భధారణల మధ్య సరైన వ్యవధి ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన పెంచాలని కేంద్రం పిలుపునిచ్చింది. సరైన సమాచారం ఆధారంగా తీసుకునే ఆరోగ్యకరమైన నిర్ణయాలు కుటుంబాలను మరింత బలపరుస్తాయని, దేశ అభివృద్ధికి కూడా తోడ్పడతాయని పేర్కొంది.
కుటుంబ నియంత్రణ సేవలు, సలహాలు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని గుర్తుచేస్తూ, దంపతులు తమ ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా వైద్య నిపుణుల సలహా తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది.