గన్నవరం : కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయానికి సినీ హీరో రజనీకాంత్ చేరుకున్నారు. పోరంకిలో జరిగే ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రజనీకాంత్ కు స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ స్వయంగా వెళ్లి మరీ ఆహ్వానించారు. చెన్నై నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రజనీకాంత్ తో పాటు బాలకృష్ణ విజయవాడ వెళ్లారు.