English News Headline
CM Revanth Reddy Calls for Collective Commitment to Build Telangana as a Global Gateway
Full Telugu News Article
హైదరాబాద్:
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన అధికారిక వేడుకల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన దశాబ్దాల ఉద్యమ పోరాటాలు, అమరుల త్యాగాలను స్మరించుకుంటూ తెలంగాణను ప్రపంచానికి గేట్‌వేగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అందరూ పునరంకితమవ్వాలని పిలుపునిచ్చారు.
భద్రతా దళాల కవాతు, పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర అభివృద్ధి, పేదరిక నిర్మూలన, సమగ్ర సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణ రైజింగ్-2047 దార్శనిక పత్రం ద్వారా రాష్ట్ర భవిష్యత్తుకు సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించామని సీఎం తెలిపారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం, మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించామని చెప్పారు.
రైతుల కోసం రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ అమలు చేయడంతో పాటు వ్యవసాయం, రైతు సంక్షేమానికి రూ.1.56 లక్షల కోట్లకు పైగా వ్యయం చేసినట్లు వెల్లడించారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తూ చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.
మహిళల సాధికారత కోసం మహాలక్ష్మి పథకం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళా సంఘాలను ఆర్థిక శక్తి కేంద్రాలుగా తీర్చిదిద్దే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
యువతకు ఇచ్చిన హామీ మేరకు 67,763 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు సీఎం వెల్లడించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో సంస్కరణలు చేపట్టి పారదర్శక నియామక ప్రక్రియను అమలు చేసినట్లు తెలిపారు.
విద్యా రంగంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, ప్రీ-ప్రైమరీ తరగతుల విస్తరణ, విద్యార్థులకు అల్పాహార పథకం, జూనియర్ కళాశాలలకు మధ్యాహ్న భోజన పథకం విస్తరణ వంటి చర్యలను ప్రకటించారు.
పేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. కొత్త రేషన్ కార్డుల జారీ, గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత చట్టం, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక బీమా పథకం వంటి కార్యక్రమాలను కూడా ప్రస్తావించారు.
హైదరాబాద్ అభివృద్ధి, మెట్రో రైలు విస్తరణ, మూసీ పునరుద్ధరణ, చెరువుల పరిరక్షణ, ఫ్యూచర్ సిటీ నిర్మాణం వంటి ప్రాజెక్టులు రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని సీఎం పేర్కొన్నారు.
2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ప్రజల సహకారంతో ఈ లక్ష్యాలను సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
Full English News Article
Hyderabad:
Chief Minister A. Revanth Reddy called upon the people of Telangana to recommit themselves to the state’s development and work towards transforming Telangana into a global gateway while addressing the official Telangana Formation Day celebrations at Parade Grounds in Secunderabad.
During the ceremony, the Chief Minister received a ceremonial salute from police and security forces and extended Telangana Formation Day greetings to citizens across the state. He paid tribute to the martyrs and activists whose sacrifices contributed to the formation of Telangana.
Revanth Reddy said the government has been working with a focus on state development, poverty eradication, and inclusive welfare since assuming office. He emphasized that Telangana Rising-2047 provides a long-term development vision and a comprehensive master plan for the state’s future.
The Chief Minister highlighted several welfare and development initiatives undertaken by the government. He stated that crop loans up to ₹2 lakh had been waived and that more than ₹1.56 lakh crore had been spent on agriculture and farmer welfare over the past two and a half years.
He also outlined measures aimed at women’s empowerment, including the Mahalakshmi scheme, subsidized LPG cylinders, and free travel for women in RTC buses. According to the Chief Minister, these initiatives have significantly benefited women across Telangana.
On employment, Revanth Reddy said that 67,763 government posts had been filled through a transparent recruitment process following reforms in the Telangana Public Service Commission. He assured that recruitment notifications would continue in the future.
The Chief Minister stressed the importance of education and announced expansion of pre-primary classes in government schools, implementation of breakfast schemes, and extension of meal programs to junior colleges.
Housing, food security, social welfare, and worker protection were also highlighted. He referred to the Indiramma Housing Scheme, issuance of new ration cards, and legislative measures aimed at protecting gig workers.
Discussing Hyderabad’s growth, the Chief Minister spoke about Metro Rail expansion, lake restoration initiatives, Musi River rejuvenation, Future City development, and efforts to position Hyderabad as a world-class services hub.
Revanth Reddy reiterated the government’s ambition to transform Telangana into a $1 trillion economy by 2034 and a $3 trillion economy by 2047. He appealed to citizens to actively support the state’s long-term development vision.