ఆన్లైన్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో నగరవాసులను టార్గెట్ చేస్తున్న కేటుగాళ్లు. అమాయక ప్రజలను ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో ట్రాప్లోకి దింపి వారి వద్దనుండి వేలు, లక్షల్లో దొరికినకాడికి దోచుకుంటున్నారు. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో వచ్చే ప్రమోషన్ ప్రకటనలు ఫోన్ కాల్స్ నమ్మొద్దంటున్న సైబర్ క్రైమ్స్ పోలీసులు. టెలిగ్రామ్ యాప్ యూజర్స్ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక నుండైనా సైబర్ క్రైమ్స్ పోలీసులు సామాజిక మాధ్యమం ద్వారా కల్పిస్తున్న అవగాహన విశ్వయలపై దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.