తెలంగాణలో ఈసారి బీజేపీ ప్రభుత్వం’’ అనే ట్యాగ్ లైన్ తో బీజేపీ పావులు కదుపుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగానే తెలంగాణ వ్యాప్తంగా గోడలపై కమలం పువ్వు గుర్తు, ఎన్నికల ట్యాగ్ లైన్ తో రాతలు రాయిస్తోంది. ప్రతీ పోలింగ్ బూత్ పరిధిలో కనీసం ఐదు చోట్ల వాల్ రైటింగ్ కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రంలో ఒకే ఫార్మాట్ లో వాల్ రైటింగ్ చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఈ క్రమంలోనే పలు చోట్ల గోడలపై రాతలు రాయించే కార్యక్రమం చేపట్టారు. గోడలపై.. తెలంగాణలో ఈసారి బీజేపీ ప్రభుత్వం అంటూ రాస్తుండడంతో రాజకీయ హీట్ మరంత పెరిగింది. ఎన్నికలకు ఎనిమిది నెలల ముందే బీజేపీ పార్టీ ఈ రేంజ్ లో ప్రణాళికలు రూపొందిస్తుండడంతో మిగతా పార్టీలు కూడా సన్నాహాలు మొదలు పెట్టాయి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సంపూర్ణ మెజారిటీతో గెలుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.