మోడీజీ జమిలికే…. జై కొడతారా!? బిజెపికి కలిసి వస్తుందని బలంగా నమ్ముతున్న ‘మోడీషా’

లోక్‌ సభ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. జమిలి ఎన్నికలే శ్రేయస్కరమని.. దాని వల్ల ఖర్చు తగ్గి ఖజానాకు భారీ ఆదా అవుతుందని తెలిపింది. లోక్‌ సభలో ఓ ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. అయితే రాజ్యాంగ సవరణ అన్ని రాజకీయ పార్టీలను ఒకేతాటిపైకి తీసుకురావడం వంటి అంశాలు ముడిపడి ఉన్నాయని తెలిపారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించి ‘జమిలి’ పోరుకు వెళ్లాలని  కేంద్రం కూడా ప్లాన్‌ చేసింది.

.దేశంలో ఒకే ఒక పార్టీ ఉండాలనేది బీజేపీ సిద్ధాంతం. ప్రత్యేకించి అది బీజేపీ కావాలన్నది కమలనాథుల ఊవాచ. మోడీ ఇప్పటికే ఇలా చేయాలని ఫిక్స్‌ అయ్యాడంట.. బీహార్‌ లో మోడీ వేవ్‌ నడిచింది.. సర్వేలు ఎన్డీఏకు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ లాస్ట్‌ లో విజేతగా బీజేపీనే నిలిచింది. ఆ వేవ్‌ ను దేశమంతా కొనసాగించాలని పట్టుదలగా ఉన్నాడట.. పశ్చిమ బెంగాల్‌ లో కనుక బీజేపీ గెలిస్తే ఈ జమిలీ ఎన్నికలకు కేంద్రం సిద్ధమైంది. 

కానీ ఓటమితో ప్రక్రియ ఆగిపోయింది. 2023లో మళ్లీ జమిలి ఎన్నికలకి వెళ్లి ఫుల్‌ మెజార్టీ తెచ్చుకొని ఇండియా మొత్తం ఒకే పార్టీని ఉండేలా చేయాలని బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించిం దట.
 ఇక దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలని బీజేపీ స్కెచ్‌ గీస్తోంది. ప్రతి బూత్‌ లో బీజేపీకి గణనీయంగా ఓట్లు రాబట్టుకో వాలని.. ఈరోజు పరిస్థితి ప్రతి గ్రామంలో మోడీ గురించి మాట్లాడు కుంటున్నారు కాబట్టి బూత్‌ లెవల్‌ లో బీజేపీని బలోపేతం చేస్తే ప్రతి నియోజకవర్గంలో బీజేపీని గెలిచేలా చేయవచ్చని ఆ పార్టీ ఉవ్విళ్లూరు తోందట.. అందుకే 2023 మార్చి-ఏప్రిల్‌ లో జమిలి ఎన్నికలకు వె ళ్లాలని బీజేపీ చూస్తోందని అంటున్నారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిపితే బీజేపీదే విజయం అని.. ఆ గాలిలో ప్రాంతీయ పార్టీలు కొట్టుకొని పోయి మొత్తం బీజేపీ హవా నడుస్తుందని ప్లాన్‌ చేస్తున్నారట..  మరి ఈ ప్లాన్లు వర్కవుట్‌ అవుతాయా? కావా అన్నది వేచిచూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *