హైదరాబాద్ : పోలీసులపై దాడి కేసులో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లోటస్పాండ్ దగ్గర సోమవారం పోలీసులపై దాడి కేసులో వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆమెను పోలీసులు చంచల్ గూడా జైలుకు తరలించారు. దీనిపై షర్మిల బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ చేపట్టిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది.