ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తే అరెస్ట్‌ చేస్తారా!నేను కొట్టాలనుకుంటే కొట్టగలను.. నేను కొట్టలేదు’.. వైఎస్సార్టీపీ నేత వైఎస్‌ విజయమ్మ…

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల పాదయాత్రను ఆపాల్సిన అవసరం లేదని వైఎస్‌ విజయమ్మ అన్నారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారనే షర్మిలను అడ్డుకుంటున్నారని విమర్శించారు. షర్మిల టెర్రరిస్ట్‌ కాదన్నారు. ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తే అరెస్ట్‌ చేస్తారా అంటూ మండిపడ్డారు. ఎప్పుడూ చూసిన షర్మిల ఇంటి చుట్టూ పోలీసులు ఉంటున్నారన్నారు. షర్మిలను పోలీసులు ఎందుకు అరెస్ట్‌ చేశారో కారణం చెప్పమంటే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లానని తెలిపారు. షర్మిలకు వ్యక్తి గత స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. ‘‘పోలీసులు విూద విూద పడుతుంటే ఆవేశం రాదా.. నేను కొట్టాలనుకుంటే కొట్టగలను..నేను కొట్టలేదు’’ అని అన్నారు. నియంత, అసమర్ధ పాలనను ప్రశ్నిస్తున్నారని… ప్రశ్నించే గొంతుని నొక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల సిట్‌ కార్యాలయానికి వెళ్తుంటే అరెస్ట్‌ చేశారని వైఎస్‌ విజయమ్మ పేర్కొన్నారు.కాగా.. పోలీసులపై చేయి చేసుకున్న కారణంగా వైఎస్‌ షర్మిలను పోలీసులు అరెస్ట్‌ చేసి జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. షర్మిలపై ఐపీసీ 330, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విషయం తెలిసిన వైఎస్‌ విజయమ్మ.. కూతురు షర్మిలను పరామర్శించేందుకు జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. విజయమ్మను పోలీసులు అడ్డుకోవడంతో విజయమ్మ అసహనం వ్యక్తం చేస్తూ, పోలీసులతో వాగ్వాదానికి దిగాల్సివచ్చిందన్నారు. మీడియాకు చేతులెత్తి అభ్యర్థిస్తున్నా ప్రజల తరఫున నిలబడండి. మీడియా నిజాలు చూపించాలి. చిన్నచిన్న విషయాలను పెద్దగా చూపించడం కాదు. మీడియా ప్రజల కోసం పని చేయాలి. వైయస్ షర్మిల ప్రజల కోసం పోరాడుతుంది. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు సాకారం చేయడానికి కష్టపడుతోంది. ఒక మహిళ 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసిందంటే ప్రజలు ఆలోచించాలిని విజయమ్మ అన్నారు. న్యాయంగా ప్రశ్నించే గొంతును ఎంతకాలం అణచివేస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ప్రశ్నించిన వాటికి పరిష్కారం చూపించకుండా ప్రభుత్వం ఇలా వ్యవహరించడమేంటిని ప్రశ్నించారు. ఇలా ఎన్ని సార్లు పోలీసులు అరెస్టులు చేస్తారు. అసమర్థతను పక్కనపెట్టి.. నియంత పాలన వదిలి ప్రజల కోసం పని చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నమన్నారు. ఈ విషయంపై కోర్డుకు వెళ్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *