కీసర మండలం చిర్యాల మరియు తిమ్మాయిపల్లి గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా దాదాపు యాభై లక్షల రూపాయలతో ఆధునికరించిన ( నూతన ఫర్నిచర్, బాత్ రూమ్లు, కిచెన్ షెడ్,మొదలుగున్నవి) మండల పరిషత్ ప్రైమరీ పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి. అలాగే విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందేజేసారు. స్కూల్,క్లాస్ ఫస్ట్ వచ్చిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమలలో ఎంపీపీ ఇందిరా లక్ష్మి నారాయణ, ఎంపీటీసీలు, స్థానిక సర్పంచ్లు, మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి,నాయకులు, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు,తదితరులు పాల్గొన్నారు.