7న తెలంగాణకు మాయవతి…


బీఎస్పీ చీఫ్‌ మాయావతి వచ్చే నెల 7వ తేదీన తెలంగాణకు రానున్నారు. ఈ మేరకు ‘భరోసా’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీఎస్పీ నేతలు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్‌ లోని సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో సభను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలో విూడియా సమక్షంలో బహిరంగ సభ తేదీని అధికారికంగా వెల్లడిరచనున్నారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాయావతి మొదటిసారి తెలంగాణకు వస్తున్నారు. దీంతో ఆర్‌ఎస్పీని, మాయావతిని తెలంగాణ సభలో ఒకే వేదికపై చూసేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు.బహుజన రాజ్యాధికార యాత్రతో ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ చేరువయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిత్యం పోరాడుతూనే ఉన్నారు. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. యూనివర్శిటీలు, కోచింగ్‌ సెంటర్లు, లైబ్రరీల్లో విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలు తెలుసుకుంటూ వారిని కలుస్తున్నారు. అఖిలపక్ష నాయకులతో కలిసి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటికే ఆర్‌ఎస్పీ పొలిటికల్‌గా కలిసొచ్చే జిల్లాపై ఫోకస్‌ పెట్టారు. బీఎస్పీకి ఏ ఏ జిల్లాలో ఏఏ నియోజకవర్గాల్లో ఆదరణ ఉందో అన్నదానిపై దృష్టిసారించారు. ముఖ్యంగా మొదటి నుంచి బీఎస్పీకి అనుకూలంగా ఉండే ఉమ్మడి మహబూబ్‌ నగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలపై ఆర్‌ఎస్పీ ప్రత్యేక దృష్టి పెట్టారు. మిగిత జిల్లాల్లో కూడా పార్టీ బలోపేతం కోసం వ్యూహం సిద్ధం చేసినట్లు సమాచారం.బీఎస్పీ పట్ల ప్రజల్లో క్రేజ్‌ పెంచడం, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు మాయావతితో బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూడా నేతలు వస్తున్నట్లు సమాచారం. ఈ సభకు భారీగా జనసవిూకరణ చేయడం కోసం ప్లాన్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితులకు ఇచ్చిన హావిూలు, ప్రజా సమస్యలపై ఈ సభ ద్వారా ఆర్‌ఎస్పీ నిలదీయనున్నారు. ఈ సభలో బీఎస్పీ చీఫ్‌ మాయావతి చేయబోయే ప్రసంగం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై, లిక్కర్‌ స్కాం వ్యవహారంపై ఏవిధంగా కామెంట్స్‌ చేస్తారనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *