అలియాబాద్ మున్సిపాలిటీలో మజీద్‌పూర్‌లో రూ.10 లక్షల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను చైర్‌పర్సన్ శిరీష కృష్ణారెడ్డి ప్రారంభించారు.
Chairperson Sirisha Krishna Reddy launched Rs 10 lakh underground drainage works in Majidpur under Aliabad Municipality.

Chairperson Sirisha Krishna Reddy launched Rs 10 lakh underground drainage works in Majidpur under Aliabad Municipality.
అందరి సహకారంతో అలియాబాద్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి తెలిపారు. మున్సిపల్ అభివృద్ధి పనులు దశలవారీగా కొనసాగుతాయని ఆమె అన్నారు.
Aliabad Municipality will be developed as a model municipality with the support of all people, said Chairperson Kantham Sirisha Krishna Reddy. She stated that municipal development works will continue phase by phase.
శామీర్‌పేట మండలం అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని 10, 11వ వార్డులైన మజీద్‌పూర్‌లో రూ.10 లక్షల మున్సిపల్ జనరల్ నిధులతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను సోమవారం చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మున్సిపల్ అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా తీసుకుని ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు.
ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రాధాన్యత ఆధారంగా పనులు చేపడుతున్నామని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.
పార్టీలకతీతంగా అందరూ కలిసి సహకరిస్తేనే మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దగలమని ఆమె అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ చంద్రశేఖర్, వార్డు కౌన్సిలర్లు సామల జశ్వంత్ రెడ్డి, సరసం వనజ అశోక్ రెడ్డి, ఏఈఈ సనా షాహీన్, మాజీ సర్పంచ్ ఏళ్ల మల్లేష్, స్థానిక నాయకులు నర్సింగ్ రావు గౌడ్, వెంకటయ్య, భాస్కర్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, వినోద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Underground drainage works worth Rs.10 lakh were inaugurated on Monday in Majidpur of Ward Nos. 10 and 11 under Aliabad Municipality in Shamirpet mandal by Chairperson Kantham Sirisha Krishna Reddy using municipal general funds.
Speaking on the occasion, she said municipal development is the main priority and the administration is moving forward with that goal. She stated that development works are being taken up in phases to provide better civic infrastructure to the public.
She said priority is being given to areas facing major drainage issues and that special focus is being placed on sanitation, cleanliness, and infrastructure development across the municipality.
She added that only with cooperation from all sections, beyond political differences, can the municipality be transformed into a model municipality. Development works will continue based on public needs and local priorities.
Commissioner Chandrasekhar, ward councillors Samala Jashwanth Reddy, Sarasam Vanaja Ashok Reddy, AEE Sana Shaheen, former Sarpanch Yella Mallesh, local leaders Nursing Rao Goud, Venkataiah, Bhaskar Goud, Jagadeeshwar Goud, Vinod Goud and others participated in the programme