అలియాబాద్‌లో జనాభా లెక్కలు 2027 శిక్షణ ప్రారంభంతప్పిదాలు లేకుండా లెక్కలు చేపట్టాలి…

Aliabad Population Census 2027 Training Begins | Ensure Error-Free Enumeration

అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో జనాభా లెక్కలు 2027 కార్యక్రమాన్ని ఎలాంటి తప్పిదాలు లేకుండా ఖచ్చితంగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ సూచించారు. గణన ప్రక్రియలో డేటా సేకరణ సమర్థవంతంగా జరగాలని ఆయన అన్నారు.

Population Census 2027 should be conducted accurately without any errors, said Aliabad Municipal Commissioner Chandrasekhar. He stressed the need for efficient and precise data collection during the enumeration process.

శామీర్‌పేట మండలం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జనాభా లెక్కలు 2027లో భాగంగా మూడు రోజులపాటు నిర్వహించనున్న ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ పరిధిలో జనాభా లెక్కల కార్యక్రమం సమర్థవంతంగా అమలు కావాలని, ఎలాంటి తప్పిదాలు లేకుండా ఖచ్చితమైన సమాచారాన్ని నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వానికి సరైన ప్రణాళికలు రూపొందించడంలో జనాభా లెక్కలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

మొదటి విడతగా మే 11 నుంచి జూన్ 9 వరకు గణన గృహాల సంఖ్య లెక్కించడం జరుగుతుందని చెప్పారు. ప్రతి ఇంటి వివరాలు, కుటుంబాల సంఖ్య, గృహాల స్థితిగతులను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు.

శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ పి తిరుమలేష్, ఫీల్డ్ ట్రైనర్స్ రవీంద్ర చారి, యాదగిరి, మహేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

A three-day training programme for enumerators and supervisors under Population Census 2027 was inaugurated on Monday by Municipal Commissioner Chandrasekhar at the Zilla Parishad High School in Aliabad Municipality limits of Shamirpet mandal.

Speaking on the occasion, he said the census process should be implemented effectively across the municipal area with complete accuracy and without any mistakes. He stated that population census plays a key role in helping the government prepare proper development plans and welfare schemes.

He informed that in the first phase, counting of houses and household units will be conducted from May 11 to June 9. He advised officials to record household details, family numbers, and housing conditions properly.

Master Trainer P. Tirumalesh, Field Trainers Ravindra Chari, Yadagiri, Mahesh, Ashok and others participated in the training programme.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *