English News Headline
Health Benefits of Drinking Water Stored in Copper Vessels Explained

Full Telugu News Article
ఆధునిక జీవితంలో ప్లాస్టిక్ బాటిళ్లు, ఫిల్టర్ల వినియోగం పెరిగినా, మన పూర్వీకులు అనుసరించిన రాగి పాత్రలో నీళ్లు నిల్వ చేసి తాగడం అనే పద్ధతి ఇప్పటికీ ఆరోగ్యపరంగా ఎంతో విలువైనదిగా భావిస్తున్నారు. రాగి పాత్రలో కనీసం 8 గంటలు నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని పలువురు నిపుణులు చెబుతున్నారు.
NIH అధ్యయనాల ప్రకారం రాగికి సహజ శుద్ధి గుణాలు ఉన్నాయి. రాగి పాత్రలో నీటిని నిల్వ ఉంచినప్పుడు, నీటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా తగ్గి నీరు మరింత శుద్ధి అవుతుంది. ఇది సహజ ఫిల్ట్రేషన్ ప్రక్రియగా పనిచేస్తుందని చెబుతున్నారు.
ఆయుర్వేదం ప్రకారం శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేయడంలో రాగి సహాయపడుతుంది. జీర్ణక్రియను వేగవంతం చేసి, గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో రాగి నీరు ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో కూడా రాగి నీరు తోడ్పడుతుందని చెబుతున్నారు. శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరచి ఎముకలు, కీళ్ల బలాన్ని పెంచడంలో ఇది సహాయపడుతుంది. థైరాయిడ్ గ్రంధి పనితీరు సక్రమంగా ఉండేందుకు కూడా రాగి పాత్రలో నీళ్లు ఉపయోగకరంగా ఉండొచ్చని పేర్కొంటున్నారు.
ఇమ్యూనిటీ పెంపులో కూడా రాగి పాత్ర నీరు పాత్ర ఉంది. రాగి అయాన్లు నీటిలోని హానికరమైన క్రిములను తగ్గించి శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుదలకు కూడా ఇది తోడ్పడుతుందని చెబుతున్నారు.
అయితే జాగ్రత్తలు కూడా అవసరం. రాగి పాత్రలో నీటిని మాత్రమే నిల్వ చేయాలి. పాలు, మజ్జిగ, పుల్లటి పదార్థాలు ఉంచకూడదు. రోజుకు రెండు గ్లాసులు మాత్రమే తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పాత్రను నిమ్మకాయ లేదా చింతపండుతో శుభ్రం చేస్తూ ఉండాలి.
Full English News Article
Even though plastic bottles and water filters have become common in modern life, the traditional practice of storing drinking water in copper vessels is still considered highly beneficial for health. Experts say that drinking water stored in a copper vessel for at least 8 hours can provide multiple health benefits.
According to studies by NIH, copper has natural purification properties. When water is stored in a copper vessel, harmful bacteria present in the water are reduced, making it cleaner and safer. This process is often described as a natural filtration system.
Ayurveda explains that copper helps balance the body’s Vata, Pitta, and Kapha doshas. Drinking copper-stored water may improve digestion, reduce gas, acidity, and bloating, and help cleanse the digestive system naturally.
Copper water is also believed to help reduce joint pain and arthritis-related discomfort. It supports collagen production in the body, which strengthens bones and connective tissues. Experts also suggest that copper may support proper thyroid gland function and help reduce fatigue linked to thyroid imbalance.
Immunity improvement is another major benefit. Copper ions can help destroy harmful microbes in water and support better immune function. It may also help improve hemoglobin levels and support overall blood health.
However, some precautions are necessary. Only water should be stored in copper vessels. Milk, buttermilk, and sour food items should not be kept in them. Experts recommend drinking only two glasses per day and cleaning the vessel regularly using lemon or tamarind to prevent oxidation.