ప్రభుత్వ పథకాల వినియోగంపై అవగాహన…

Shamirpet Aliyabad Meeting

శామీర్‌పేట మండలం అలియాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
Officials urged eligible beneficiaries to make use of government welfare schemes at a meeting held in Aliyabad of Shamirpet mandal.

శామీర్‌పేట మండలం అలియాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పథకాల వివరాలు తెలుసుకోవడానికి సంబంధిత కార్యాలయాలను సంప్రదించాలని చెప్పారు.

మున్సిపల్ చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. లబ్ధిదారులు స్వయంగా ముందుకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివిధ శాఖల అధికారులు చేయూత పెన్షన్, ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, డ్వాక్రా మహిళలకు రుణాలు, స్త్రీ శక్తి క్యాంటీన్ వంటి పథకాల వివరాలను ప్రజలకు వివరించారు.

2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇంటి పన్నుల వసూళ్లలో అలియాబాద్ మున్సిపాలిటీ రాష్ట్ర స్థాయిలో 91.5 శాతం వసూళ్లతో 6వ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. పన్నుల వసూళ్లలో ప్రతిభ కనబరిచిన బిల్ కలెక్టర్లను సన్మానించారు. తుర్కపల్లి వెంకటేష్ 94 శాతంతో మొదటి స్థానం, అలియాబాద్ అనిల్ రెడ్డి 93 శాతంతో రెండవ స్థానం, యాడారం ప్రశాంత్ 92 శాతంతో మూడవ స్థానం సాధించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.

A meeting was held at the Aliyabad Municipal Office in Shamirpet mandal as part of the Praja Palana–Pragathi Pranalika programme. Additional Collector Faizan Ahmed addressed the gathering and urged eligible beneficiaries to fully utilize the government welfare schemes. He advised citizens to approach the concerned offices for complete information regarding the schemes.

Municipal Chairperson Kantham Shirisha Krishna Reddy stated that steps are being taken to ensure that benefits reach all eligible people. Officials from various departments explained schemes such as Cheyutha pensions, free bus travel, Indiramma housing, 200 units free electricity, loans for DWCRA women, and other welfare initiatives.

It was also announced that Aliyabad Municipality secured 6th place at the state level with 91.5% property tax collection in the financial year 2025–26. Bill collectors who performed well were felicitated. Venkatesh from Turkapally secured first place with 94%, Anil Reddy from Aliyabad stood second with 93%, and Prashanth from Yadaram secured third place with 92%. Local representatives, officials, and residents attended the programme.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *