పాఠశాల పునర్నిర్మాణం ప్రారంభం

English News Headline

Renovated Primary School Inaugurated in Shamirpet Medchal Telangana


శామీర్‌పేట్ మండలంలోని పోతాయిపల్లి గ్రామంలో పునర్నిర్మించిన ప్రాథమిక పాఠశాలను అతిథులు ప్రారంభించారు.
Renovated primary school in Pothayipalli village of Shamirpet mandal was inaugurated by guests.

మెద్చల్ జిల్లా శామీర్‌పేట్ మండలం పోతాయిపల్లిలో ప్రాథమిక పాఠశాల పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన ఎన్సిఆర్ వోయిక్స్, బెంగళూరుకు చెందిన హావిన్ హోల్ సంస్థలు సంయుక్తంగా CSR కార్యక్రమంలో భాగంగా ఈ అభివృద్ధి పనులను చేపట్టాయి.

సుమారు రూ.10 లక్షల వ్యయంతో పాఠశాలలో తరగతి గదుల పునరుద్ధరణ, శుద్ధి చేసిన త్రాగునీటి కోసం వాటర్ ఫిల్టర్, కంప్యూటర్, ప్రింటర్, మైక్ సెట్, నూతన ఫర్నిచర్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, కాంపౌండ్ వాల్ నిర్మాణం వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు.

శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సంస్థల ప్రతినిధులు శ్రీధర్, విశ్వనాథ్, నందిని, జిల్లా ఆర్టీఏ సభ్యుడు భీమిడి జైపాల్ రెడ్డి, ఎంఈఓ కమలాకర్, ప్రధానోపాధ్యాయురాలు సంధ్య పాల్గొని పాఠశాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడం తమ లక్ష్యమని తెలిపారు. స్థానిక నాయకులు, గ్రామస్థులు విద్యార్థుల హాజరు పెంచేందుకు సహకరించాలని కోరారు.

కేవలం 45 రోజుల్లో పనులు పూర్తి చేసిన సంస్థల ప్రతినిధులను స్థానికులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. తెలంగాణలో గ్రామీణ పాఠశాలల అభివృద్ధికి ఈ చర్యలు దోహదపడనున్నాయి

.

In Medchal district’s Shamirpet mandal, renovation works of the primary school in Pothayipalli village have been completed. NCR Voix from Hyderabad and Havin Hole from Bengaluru jointly undertook the development under CSR initiatives.

With an expenditure of around ₹10 lakh, facilities such as classroom renovation, water filter for safe drinking water, computer, printer, microphone set, new furniture, overhead water tank, and compound wall were provided.

The inauguration was held on Friday in the presence of representatives Sridhar, Vishwanath, Nandini, District RTA member Bheemidi Jaipal Reddy, MEO Kamalakar, and Headmistress Sandhya.

The representatives stated that providing a better learning environment for students is their primary objective. Local leaders and villagers were urged to support efforts to improve student attendance.

The works were completed within 45 days, and the representatives were felicitated by locals. Teachers, parents, and villagers attended the event. This initiative is expected to strengthen rural school infrastructure in Telangana.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *