గన్నవరం నియోజకవర్గం నుంచి డబ్బున్నోడిని కాదు దమ్మున్నోడిని నిలబెడతాంమంటూ టిడిపి సీనియర్ నేత చింతమనేని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. గన్నవరం నియోజకవర్గం సీటు కోసం ఒక వ్యక్తి 150 కోట్లు కోట్లు ఖర్చు పెడతానంటూ తన దగ్గరికి వచ్చినట్లు చెప్పుకొచ్చాడు చింతమనేని. అయితే గన్నవరం సీటు కోసం 150 కోట్లు ఖర్చు పెడతానని తనను కలిసిన వ్యక్తి పేరు మాత్రం చింతమనేని చెప్పలేదు. ఓట్లు ఖర్చుపెట్టే వ్యక్తిని కాదు మీసం మేలేసే దమ్మున్న వ్యక్తిని బరిలోకి దింపుతామంటూ సినిమా పవర్ పంచ్ డైలాగులు తో ఒక్కసారిగా గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ వేడికి తెరలేపారు. ఒకరు పోతే 100 మంది వస్తారని, వంశీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చింతమనేని.