కాంగ్రెస్‌ గూటికేనా పొంగులేటి, జూపల్లి…


బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ అయిన నేతలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. సరూర్‌ నగర్‌ లో నిర్వహించే నిరుద్యోగ దీక్షకు ప్రియాంక గాంధీ హాజరుకానుండగా తొలిసారి రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రియాంక గాంధీ సమక్షంలో ఇరువురు పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, రేణుకా చౌదరి ఇంట్లో చర్చలు జరిపారు. అయితే ఎన్నికలు సవిూపిస్తున్న తరుణంలో వీరిని చేర్చుకోవడంతో కాంగ్రెస్‌ ఒక దూకుడైన సిద్ధాంతంలో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇంకా పెద్ద ఎత్తున చేరికలు చేయాలని నిర్ణయించినట్లు స్పష్టమవుతుంది.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణలో కేసీఆర్‌ సర్కార్‌ కు గట్టి పోటీ ఇచ్చేలా కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్రంలో బలంగా పార్టీని తీసుకు వెళ్లేలా ప్లాన్‌ చేస్తున్నారు. బలమైన లీడర్లను చేర్చుకోగలిగితే వాళ్ల స్థాన బలంతో గెలుస్తామని కాంగ్రెస్‌ భావిస్తుంది. ఈ క్రమంలోనే పొంగులేటి, జూపల్లి సహా బీఆర్‌ఎస్‌, బీజేపీ అసంతృప్త నేతలపై కాంగ్రెస్‌ పార్టీ గురి పెట్టింది. రాష్ట్రంలో రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ సర్కార్‌ పై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ప్రయాత్నాల్లో కాంగ్రెస్‌ ఉంది.పొంగులేటి, జూపల్లికి ప్రజాబలం ఉండటంతో పాటు ఆర్థికంగా బలమైన నేతలు కావడంతో రాహుల్‌ గాంధీ టీమ్‌ వారితో చర్చలు జరిపింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పోదెం వీరయ్య నియోజకవర్గాలు మినహా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మిగతా సీట్లన్నీ పొంగులేటి అనుచరులకు ఇచ్చేందుకు రాహుల్‌ గాంధీ టీమ్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు జూపల్లి కృష్ణారావు ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ లో తనతో పాటు తన సన్నిహితులకు టికెట్లు ఇవ్వాలని కోరుతున్నాడు. దీంతో పాటు ఆయనపై ఢల్లీి నుంచి హస్తం పెద్దలు ఒత్తిడి తెస్తున్నారు. కేసీఆర్‌ ను ఓడిరచాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌ లో చేరితేనే నెరవేరుతుందని.. ఈ టైంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని హస్తం నేతలు సూచించినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సానుకూలంగా స్పందించడంతో ఈ నెల 30వ తారీఖున వీరు చేరుతున్నట్లు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *