Exam Pads Distributed to Class 10 Students

పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రోత్సాహం కల్పించేందుకు శామీర్పేట మండలంలోని పాఠశాలలో ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేశారు. Exam pads were distributed to Class 10 students at a school in Shamirpet mandal to encourage them ahead of their examinations.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, శామీర్పేట: శామీర్పేట మండలం మూడు చింతలపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జెర్రిపోతుల నర్సింలు విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను అందజేసి వారికి ప్రోత్సాహం కల్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. క్లాసులో మొదటి స్థానం సాధించిన విద్యార్థికి రూ.5,016 నగదు బహుమతి అందజేస్తానని ప్రకటించారు. విద్యార్థులు బాగా చదివి తమ గ్రామానికి గుర్తింపు తీసుకురావాలని, తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను నెరవేర్చాలని పేర్కొన్నారు. చదువు వ్యక్తి జీవితంలో ఎంతో కీలకమని, విద్యతోనే సమాజంలో గౌరవం మరియు అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేశ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్. శ్రీకాంత్ గౌడ్, మాజీ ఎంపీటీసీ అఖిలేష్ రెడ్డి, నాయకులు హరిబాబు, బసవ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, దామోదర్ రెడ్డి, జె. వెంకటేష్, మేడిపల్లి రాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Exam pads were distributed to Class 10 students at the Zilla Parishad High School in Moodu Chintalapalli village of Shamirpet mandal in Medchal-Malkajgiri district.
Senior Congress leader Jerripothula Narsimlu handed over the exam pads to students and encouraged them to focus on their studies and perform well in the upcoming examinations. He announced a cash prize of ₹5,016 for the student who secures first rank in the class.
He advised students to study diligently, bring recognition to their village and fulfill the expectations of their parents. He emphasized that education plays a crucial role in shaping a person’s future and helps earn respect and opportunities in society. Several local leaders and party workers attended the programme