విద్యార్థుల హాస్టల్‌లో అర్ధరాత్రి జరిగిన దాడిలో 9వ తరగతి విద్యార్థి మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. In a shocking midnight attack inside a school hostel, a Class 9 student was killed and several others were injured after a fellow student allegedly attacked them with an iron rod.

కర్ణాటక రాష్ట్రంలోని Ballari లో ఉన్న Gurukul International School హాస్టల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కర్నూలు జిల్లాకు చెందిన హేమంత్ అనే 9వ తరగతి విద్యార్థి ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. అతను Kurnool District లోని ఆలూరు తాలూకా పులగుంద మండలం సమ్మతగేరి గ్రామానికి చెందినవాడిగా సమాచారం.

సీనియర్ న్యాయవాది బి. లక్ష్మీకాంత్ కుమారుడైన హేమంత్ బళ్లారిలోని రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నాడు. శనివారం అర్ధరాత్రి విద్యార్థులు నిద్రలో ఉండగా, అదే హాస్టల్‌లో చదువుతున్న భరత్ అనే విద్యార్థి అకస్మాత్తుగా ఇనుప రాడ్ తీసుకుని తోటి విద్యార్థులపై దాడి చేసినట్లు సమాచారం.

ఈ దాడిలో హేమంత్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో తొమ్మిది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వార్డెన్, సెక్యూరిటీ సిబ్బందిపైనా ఆ విద్యార్థి దాడి చేసినట్లు తెలిసింది. గాయపడిన వారిని వెంటనే బళ్లారిలోని Ballari Institute of Medical Sciences ట్రామా కేర్ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

హాస్టల్‌లో జరిగిన ఈ ఘటన గురించి తెలిసి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పెద్ద సంఖ్యలో హాస్టల్ వద్దకు చేరుకున్నారు. హేమంత్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

According to preliminary information, the accused student allegedly fled from the hostel after the attack. Police teams have launched a search operation to trace him. Investigators are also trying to determine the motive behind the attack, including whether the student was facing psychological issues or was under the influence of drugs at the time of the incident.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *