హైదరాబాద్‌లో తక్కువ ఫీజుతో భారీ రుణాలు ఇప్పిస్తానని నమ్మబలికి మహిళను మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

. Hyderabad police arrested a man who cheated a woman by promising to arrange a huge loan for a small fee.

హైదరాబాద్‌లో తక్కువ ఫీజుతో భారీ రుణాలు ఇప్పిస్తానని నమ్మబలికి మహిళను మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. Hyderabad police arrested a man who cheated a woman by promising to arrange a huge loan for a small fee.

హైదరాబాద్‌లో మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తక్కువ ఫీజుతో భారీ లోన్ ఇప్పిస్తానని నమ్మబలికి ఒక మహిళ నుంచి నగదు, బంగారం దోచుకున్న నిందితుడిని రాంగోపాల్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. Hyderabad police intensified action against fraudsters. A man who allegedly cheated a woman by promising a high-value loan for a low fee was arrested by Ramgopalpet police.

నిందితుడిని తురికెపల్లి భరత్ సాయి చంద్రగా గుర్తించారు. తాను IDFC బ్యాంక్ ఉద్యోగినని చెప్పి బాధిత మహిళను నమ్మించాడు. తక్కువ ఫీజుతో పెద్ద మొత్తంలో రుణం ఇప్పిస్తానని చెప్పి ఆమెను మోసం చేశాడు. The accused was identified as Turikepalli Bharat Sai Chandra. He allegedly posed as an IDFC Bank employee and convinced the victim that he could arrange a large loan at a minimal processing fee.

రూ.2.80 కోట్ల లోన్ ఇప్పిస్తానని చెప్పి బాధితురాలి నుంచి రూ.10.69 లక్షల నగదు, 190 గ్రాముల బంగారం తీసుకున్నాడు. తరువాత ఆమెను తప్పించుకుని తిరుగుతూ ఉండగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. He reportedly collected ₹10.69 lakh in cash and 190 grams of gold from the victim on the pretext of arranging a ₹2.80 crore loan. Later he avoided the victim, prompting her to file a police complaint.

కేసు నమోదు చేసిన రాంగోపాల్‌పేట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫతేనగర్ బ్రిడ్జి వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి ఫోర్డ్ ఎండీవర్ కారు, ఐఫోన్, రూ.4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 160 గ్రాముల బంగారు బిస్కెట్‌ను కూడా రికవరీ చేశారు. Police registered a case and launched an investigation. The accused was apprehended near Fatehnagar Bridge. Officials seized a Ford Endeavour car, an iPhone and ₹4 lakh in cash from him, along with a 160-gram gold biscuit.

అదనంగా అతడి బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.4 లక్షలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నిందితుడిపై ఇప్పటికే 8 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ రుణాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. Police also froze ₹4 lakh in his bank account. Officials said the accused is a habitual offender with eight previous cases and had been cheating people by posing as a bank employee.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *