అనంతపురం జిల్లాలోని పామిడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచం కేసులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇంటి రిజిస్ట్రేషన్ కోసం రూ.25 వేల లంచం తీసుకున్నట్లు ఆరోపణలపై సబ్ రిజిస్ట్రార్ రాధరమణ ఏసీబీ వలలో చిక్కారు.

Pamidi Sub-Registrar Caught by ACB While Accepting ₹25,000 Bribe in Anantapur

అనంతపురం జిల్లాలోని పామిడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచం కేసులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇంటి రిజిస్ట్రేషన్ కోసం రూ.25 వేల లంచం తీసుకున్నట్లు ఆరోపణలపై సబ్ రిజిస్ట్రార్ రాధరమణ ఏసీబీ వలలో చిక్కారు.
Anti-Corruption Bureau officials conducted raids at the Pamidi Sub-Registrar office in Anantapur district, where Sub-Registrar Radharaman was caught in a bribery case for allegedly accepting ₹25,000 for a house registration.

అనంతపురం జిల్లాలోని పామిడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఇంటి రిజిస్ట్రేషన్ పనిని పూర్తి చేయడానికి రూ.25 వేల లంచం తీసుకున్నట్లు ఆరోపణలపై సబ్ రిజిస్ట్రార్ రాధరమణను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఈ కేసులో ప్రైవేట్ వ్యక్తి వెంకటేశులు ద్వారా లంచం స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. రాధరమణ సూచనతోనే తాను లంచం తీసుకున్నట్లు వెంకటేశులు ఏసీబీ అధికారులకు వెల్లడించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సీఐ హమీద్ ఖాన్ కార్యాలయంలో రాధరమణను విచారించారు. అనంతరం అనంతపురంలో ఉన్న ఆయన నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇంటికి తాళం వేసి పత్రాలు, ఇతర ఆధారాలను పరిశీలించారు. ఈ ఘటనపై మరింత విచారణ కొనసాగుతోంది.

Anti-Corruption Bureau officials carried out surprise inspections at the Pamidi Sub-Registrar office in Anantapur district. Sub-Registrar Radharaman was caught in a bribery case after allegedly accepting ₹25,000 to complete a house registration process.

Officials stated that the bribe amount was received through a private individual named Venkatesulu. During questioning, Venkatesulu reportedly told ACB officials that he collected the money on the instructions of the Sub-Registrar.

ACB DSP Prasad Reddy and CI Hameed Khan questioned Radharaman at the office regarding the allegations. Later, officials also conducted searches at his residence in Anantapur. The house was locked during the inspection while documents and other materials were examined. Further investigation into the case is underway.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *