హైదరాబాద్‌లో హెచ్-సిటీ పనుల నేపథ్యంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.

Hyderabad traffic police have imposed temporary restrictions and diversions in key stretches of Jubilee Hills and Banjara Hills due to H-CITI infrastructure works.

హైదరాబాద్‌లో హెచ్-సిటీ పనుల నేపథ్యంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. Hyderabad traffic police have imposed temporary restrictions and diversions in key stretches of Jubilee Hills and Banjara Hills due to H-CITI infrastructure works.

హైదరాబాద్‌లో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు. సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (H-CITI) పనుల ప్రారంభంతో బంజారాహిల్స్ రోడ్ నెంబర్-2, జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మార్పులు ముఖ్యంగా రద్దీ సమయాల్లో ప్రయాణించే వారికి ప్రభావం చూపనున్నాయి.

Traffic diversions have been implemented in parts of Road No.2 Banjara Hills and surrounding Jubilee Hills areas as part of the H-CITI project works. Motorists are advised to plan their commute accordingly, especially during peak hours.

ఎన్ఎఫ్సీఎల్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌కు శ్రీనగర్ కాలనీ టీ-జంక్షన్, సాగర్ సొసైటీ, కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్డు నెంబర్-36, 45, కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లే వాహనాలు శ్రీనగర్ కాలనీ టీ-జంక్షన్, సాగర్ సొసైటీ వద్ద మళ్లింపు తీసుకోవాలి. వీరు శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్, ఇందిరానగర్ లేబర్ అడ్డా, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-5, వెంకటగిరి ఎక్స్ రోడ్ మార్గం ద్వారా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ చేరుకోవచ్చు.

Vehicles heading towards KBR Park, Jubilee Hills Check Post, Road No.36, 45 and Cable Bridge from the NFCL side must take diversion at Srinagar Colony T-Junction and Sagar Society, proceeding via Srinagar Colony Main Road, Indiranagar Labour Adda, Road No.5 and Venkatagiri X Road.

జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్-36, 45 నుంచి ఎన్ఎఫ్సీఎల్ వైపు వెళ్లే వాహనాలు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, వెంకటగిరి రోడ్ నెంబర్-2, యూసుఫ్‌గూడ బస్తీ, యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్, మైత్రీవనం, అమీర్‌పేట్ మీదుగా ఇందిరానగర్ లేబర్ అడ్డా, శ్రీనగర్ కాలనీ, పంజగుట్ట మెయిన్ రోడ్ వైపు ప్రయాణించవచ్చు.

Motorists travelling towards NFCL from Road No.36 and 45 should move via Jubilee Hills Check Post, Venkategiri Road No.2, Yousufguda, Maitrivanam, Ameerpet, Indiranagar Labour Adda and Srinagar Colony towards Panjagutta Main Road.

కేసీపీ, బంజారాహిల్స్ రోడ్ నెంబర్-1 నుంచి కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు వెళ్లే వాహనాలు రోడ్ నెంబర్-10 మీదుగా క్యాన్సర్ హాస్పిటల్ వద్ద ఎడమవైపు తిరిగి అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్ మీదుగా రోడ్ నెంబర్-45 వైపు వెళ్లాలి.

From KCP and Banjara Hills Road No.1 towards KBR Park and Jubilee Hills Check Post, vehicles must take Road No.10, turn left near Cancer Hospital and proceed via Agrasen Island and Bharatiya Vidya Bhavan to reach Road No.45.

మాసబ్ ట్యాంక్ నుంచి వచ్చే వాహనాలు విరించి హాస్పిటల్ వద్ద ఎడమవైపు తిరిగి అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్ మార్గం ద్వారా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-45 చేరుకోవచ్చు.

Traffic from Masab Tank heading towards KBR Park and Jubilee Hills Check Post should turn left near Virinchi Hospital and proceed via Agrasen Island and Bharatiya Vidya Bhavan towards Road No.45.

ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు రద్దీ సమయాల్లో ఈ మార్గాలను వీలైనంత వరకు నివారించాలని సూచించారు. ట్రాఫిక్ సిబ్బంది సూచనలు, సైన్ బోర్డులు తప్పనిసరిగా పాటించాలి. తాజా అప్డేట్స్ కోసం నావిగేషన్ యాప్‌లను ఉపయోగించాలని, సాధ్యమైనంత వరకు ప్రజా రవాణా లేదా కార్ పూలింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, భారీ వాహనాలు రద్దీ సమయాల్లో ఈ మార్గాల్లో ప్రయాణించవద్దని సూచించారు.

Motorists are advised to avoid these stretches during peak hours, follow traffic police instructions and signboards, use navigation apps for live updates, prefer public transport or carpooling, and restrict heavy vehicles during congestion hours.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *