నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ లో ట్రాన్స్ జెండర్ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని టౌన్ సిఐ మల్లేష్ ప్రారంభించారు. ట్రాన్స్ జెండర్ల సంఘం అధ్యక్షురాలు సిరి ఆధ్వర్యంలో వేసవితాపాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నిర్మల్ టౌన్ సిఐ రిబ్బెన కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ వేసవికాలంలో చలివేంద్రాన్ని ప్రారంభించడం సంతోషకరమని, ట్రాన్స్ జెండర్లు అయినప్పటికీ సేవాభవంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలని సూచించారు. ట్రాన్స్ జెండర్ సిరి మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లమైన మేము ప్రజలమేనని, ప్రజలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరార