విశాఖ ఉక్కుకు కేఏపాల్‌ మద్దతు…

విశాఖపట్నం : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.తన ఆస్తులు అమ్మైనా సరే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ సంరక్షణ కోసం పోరాడుతానని విశాఖలో ప్రకటించారు.సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణతో కలసి విూడియా తో మాట్లాడుతూ మోదీ , అమిత్‌ షా దేశాన్ని అదాని, అంబానికి కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి ఇస్తామన్న హావిూలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేట్‌పరం చేసేందుకు అన్ని పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేట్‌పరం ఆపాలని రెండేళ్ల క్రితమే లేఖ రాశానట్లు చెప్పారు. అమెరికన్‌ ఫండ్‌ను నేరుగా అనుమతిస్తే.. కేంద్ర ప్రభుత్వానికి తానే ఫండ్‌ ఇస్తానని… స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేట్‌పరం కాకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కేంద్రానికి ఇష్టం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మేయాలన్నారు.అనంతరం సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం 300 మెట్రిక్‌ టన్నుల స్టీల్‌ డిమాండ్‌ ఉందని, అయితే 8వేల మంది నిర్వాసితులకు న్యాయం జరగాలన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రభుత్వ రంగ కంపెనీగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అదే విధంగా స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకోవడం కోసం అందరితో కలిసి పోరాటం చేస్తానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *