శ్రీకాకుళం : పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్ నుంచి విశాఖకు షిఫ్ట్ అవుతామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేసారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ విశాఖ ఆమోదయోగ్యమైనదని అయన అన్నారు. బుధవారం నాడు సంతబొమ్మాలి మండలం మూలపేట పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా అయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి నుంచి ఎమ్మెల్యేగా దువ్వాడ శ్రీనివాస్ పోటీలో ఉంటారని కుడా అయన స్పష్టం చేశారు. టెక్కలి నియోజకవర్గం లో వైసీపీ నాయకులు కన్ఫ్యూజన్ ఉంటే నియోజకవర్గంలో పార్టీకి తీరని నష్టం జరుగుతుందన్నారు. తన పర్యటనలో భాగంగా అయన జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు చేసారు. సంతబొమ్మాళి మండలంలో రూ.4,362 కోట్లతో మూలపేట పోర్టు పనులకు భూమి పూజ చేసారు. గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గోన్నారు.