క్లాస్‌ రూమ్లోకి వెళ్లి డోర్‌ లాక్‌ చేసుకున్న బీటెక్ విద్యార్థిని… తలుపులు బద్దలుకొట్టి చూడగా…

పక్కనే ఆరు నెలల పిండంతో… మృతి ….



నెల్లూరులో షాకింగ్‌ ఇన్సిడెంట్‌ వెలుగుచూసింది. ఓ ప్రైవేటు కాలేజ్లో బీటెక్‌ చదువుతున్న అమ్మాయి అబార్షన్‌ కారణంగా క్లాస్‌ రూమ్లోనే దుర్మరణం చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వెల్లడిరచిన వివరాల ప్రకారం.. మర్రిపాడు మండలానికి చెందిన యువతి (19) నెల్లూరులో బీటెక్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతోంది. ఈ నెల 11న క్లాస్‌ మేట్స్‌ అంతా బయట ఉండగా.. ఆమె తరగతి గదిలోకి వెళ్లి డోర్‌ లాక్‌ చేసింది. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో.. కంగారుతో ఫ్రెండ్స్‌ తలుపులు బద్దలుకొట్టి చూడగా క్లాస్‌ రూమ్లో తీవ్ర రక్తస్రావంతో యువతి అపస్మారక స్థితిలో పడి ఉండగా.. పక్కనే 6 నెలల పిండం ఉంది. అక్కడి స్టూడెంట్స్‌ వెనువెంటనే తల్లిని, పిండాన్ని ఓ హాస్పిటల్కు తరలించారు. అప్పటికే తల్లి మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యువతి తండ్రి కంప్లైంట్‌ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. క్లాస్‌ రూమ్లోనే అబార్షన్‌ అయ్యిందా? లేదా యూట్యూబ్‌ వీడియో ద్వారా తనకు తానే అబార్షన్‌ చేసుకుందా? అనే దానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. యువతి సెల్ఫోను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులోని డేటా ఆధారంగా అనంతసాగరానికి చెందిన కారు డ్రైవరుతో సన్నిహితంగా మెలిగినట్లు గుర్తించారు. దీనిపై లోతైన దర్యాప్తు చేయనున్నట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *