గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సాన, ఏఆర్ రహ్మాన్ కలయికలో రూపొందుతున్న ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ త్వరలో రాబోతోంది.
The much-awaited first single from Ram Charan, Buchi Babu Sana, and A.R. Rahman’s film Peddi is set to release soon.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా స్పెక్టకిల్ పెద్దిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రెజెంట్ చేస్తున్నాయి. టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్, చరణ్ మేకోవర్ ఇప్పటికే ఫ్యాన్స్‌లో క్రేజ్ పెంచాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

ఇప్పుడే మేకర్స్ తాజా అప్‌డేట్ ఇచ్చారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల్ త్వరలో విడుదల కానుందని ప్రకటించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, బుచ్చిబాబు, ఏఆర్ రహ్మాన్ స్టూడియోలో ఉన్న ఫోటోను షేర్ చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహ్మాన్ ఈ చిత్రానికి ప్రత్యేకమైన ఆల్బమ్‌ను సిద్ధం చేస్తున్నారు. ఫ్యాన్స్, ఆడియన్స్ ఎప్పటికీ గుర్తుంచుకునే పాటలు అందించనున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. జగపతి బాబు, దివ్యేందు శర్మలు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీ రత్నవేలు, ఎడిటింగ్ నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి చేస్తున్నారు.

పెద్ది మార్చి 27, 2026న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ కానుంది.
The much-awaited Pan India spectacle Peddi, starring global star Ram Charan and directed by Buchi Babu Sana, is creating huge expectations. Produced by Venkata Satish Kilaru under the Vriddhi Cinemas banner, the film is presented by Mythri Movie Makers and Sukumar Writings. The title glimpse, first look, and Charan’s makeover have already raised excitement among fans, while the shoot is progressing at a brisk pace.

Makers have now dropped a big update — the film’s first single, composed by Oscar-winner A.R. Rahman, will be out soon. They also released a photo of Ram Charan, Buchi Babu, and Rahman at the studio, which has gone viral on social media.

Rahman is said to have crafted a powerful album for Peddi, with songs that promise to stay memorable for fans and audiences alike.

The film features Janhvi Kapoor as the female lead, Kannada superstar Shiva Rajkumar in a key role, along with Jagapathi Babu and Divyendu Sharma in pivotal roles. The cinematography is handled by Ratnavelu, while National Award winner Naveen Nooli is the editor.

Peddi is set for a grand Pan India release on March 27, 2026.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *