garudavartha photo news prompt using:https://www.google.com

Prime Minister Narendra Modi, during his visit to China, delivered a strong message at the Shanghai Cooperation Council meeting by opposing the Belt and Road project, stating that no initiative should undermine the sovereignty of any nation.

చైనాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ షాంఘై కో ఆపరేషన్ కౌన్సిల్ సమావేశంలో బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ప్రాజెక్టులు ఉండకూడదని, అవి నమ్మకాన్ని పెంచేలా ఉండాలని సూచించారు.

చైనా చేపట్టిన ఈ భారీ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాలను కలుపుతూ అనేక కారిడార్లను నిర్మించాలనే లక్ష్యంతో సాగుతోంది. అయితే, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణంపై భారత్ కఠిన అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆ భూభాగం భారత్‌దే కాబట్టి, అలాంటి వివాదాస్పద ప్రాంతంలో ప్రాజెక్టు చేపట్టడం దేశ సార్వభౌమత్వానికి విరుద్ధమని మోదీ పరోక్షంగా చైనాను ప్రశ్నించారు.

ఇదే వేదికపై పాకిస్తాన్‌పై కూడా మోదీ వ్యాఖ్యలు చేశారు. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని పెంచుతున్నాయనీ, ఇది కేవలం దేశ భద్రతకే కాకుండా మానవాళికే ముప్పు అని తెలిపారు. ఇటీవల పహల్గాం ఎటాక్‌ను ఉదహరిస్తూ, గత నాలుగు దశాబ్దాలుగా భారత్ ఉగ్రవాదం వల్ల తీవ్ర నష్టాలు చవిచూస్తోందని చెప్పారు. “40 ఏళ్లుగా టెర్రరిజం వల్ల మేం బాధపడుతున్నాం. ఇటీవల పహల్గాం ఎటాక్ దాని భయంకర ఉదాహరణ. ఇలాంటి సమయంలో మాకు అండగా నిలిచిన దేశాలకు కృతజ్ఞతలు” అని మోదీ అన్నారు.

Prime Minister Narendra Modi, who is on a visit to China, delivered a strong message at the Shanghai Cooperation Council (SCO) meeting. He opposed the Belt and Road project, stressing that no initiative should undermine the sovereignty of any country and that projects must build trust between nations.

The massive infrastructure project launched by China aims to connect Asia, Africa, and Europe through multiple economic corridors. However, India has raised serious objections to the China–Pakistan Economic Corridor, which passes through Pakistan-occupied Kashmir. Since that land belongs to India, Modi indirectly questioned China, saying that projects in disputed regions are a violation of national sovereignty.

At the same forum, Modi also made remarks about Pakistan. He said some countries are promoting terrorism, which is not just a threat to national security but also to humanity as a whole. Citing the recent Pahalgam attack, he reminded that India has been suffering the consequences of terrorism for over four decades. “For 40 years, we have been facing terrorism. The recent Pahalgam attack is a grim example of this. We thank the countries that have stood by us in such difficult times,” Modi said.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *