
Image: Screenshot from ‘ https://www.google.com/ ” (used under fair use for reporting)
బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరిక
A low-pressure system is set to form over the west-central Bay of Bengal on the 13th, triggering heavy to very heavy rainfall across coastal Andhra Pradesh and Telangana.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో, తెలంగాణలో ఇవాళ 13 జిల్లాల్లో, రేపు 19 జిల్లాల్లో భారీ వర్షాల అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ వాతావరణ కేంద్రం ప్రకారం ఇవాళ్టి నుంచి శుక్రవారం వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బంగాళాఖాతంలో 13న అల్పపీడనం ఏర్పడి, మూడ్రోజులు (13, 14, 15) పాటు తెలంగాణలో అతిభారీ వర్షాలను కురిపించే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తేదీల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. హైదరాబాద్‌లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ సీజన్‌లో తెలంగాణలో ఇప్పటివరకు ఏడు జిల్లాల్లో అధిక వర్షపాతం, ఆరు జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. మంచిర్యాలలో 37% లోటు, పెద్దపల్లిలో 33%, జగిత్యాలలో 28%, జయశంకర్ భూపాలపల్లిలో 25%, నిర్మల్‌లో 24%, నిజామాబాద్‌లో 22% లోటు నమోదైంది. మహబూబ్ నగర్ (39%), రంగారెడ్డి (34%), యాదాద్రి (30%), వనపర్తి (24%), నారాయణపేట (24%), సిద్దిపేట (21%) జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం కొనసాగుతోంది.