
బీసీలకు న్యాయం చేయని కాంగ్రెస్ పాలనపై బీజేపీ విమర్శలు – ఆగస్టు 2న ఇందిరా పార్క్ వద్ద బీసీ మోహధర్నాకు పిలుపు
BJP Criticizes Congress for Deceiving BCs – Calls for Massive BC Protest on August 2 at Indira Park
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల హక్కులను కాదనుకుంటోందని ఆరోపించిన బీజేపీ, రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది. హైదరాబాదులో ఈ నెల 2న బీసీల మోహధర్నాకు భారీగా హాజరయ్యేందుకు పిలుపునిచ్చారు.
BJP alleged that the Telangana Congress government is denying justice to the Backward Classes (BCs), vowing to continue its fight until fair reservations are ensured. The party called for large-scale participation in the BC protest at Indira Park, Hyderabad, on August 2.
తెలుగు వార్తా కథనం | Telugu News Article:
జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు తీవ్రంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నదని, బీసీలను మోసం చేస్తున్నదని అన్నారు. కోరుట్ల పట్టణంలో ఓబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆగస్టు 2న హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ, బీసీ వర్గాల నాయకులను పిలుపునిచ్చారు. “గతంలో బీసీల శాతం 56 కాగా, ఇప్పుడు 45 శాతంగా ఎలా తగ్గిందో చెప్పాలి,” అని ప్రశ్నించారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెప్పి అందులో 10% మైనార్టీలను చేర్చడాన్ని సమంజసంగా ఎలా చెప్పగలమని విమర్శించారు.
అసెంబ్లీలో బీసీ మంత్రుల సంఖ్య ఎంత? అని ప్రశ్నించిన ఆయన, కాంగ్రెస్ పార్టీ బీసీని సీఎం చేస్తానన్న హామీని ఎలా మరిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ బీసీలకు పూర్తిస్థాయిలో 42% రిజర్వేషన్ వచ్చే వరకు ఉద్యమం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
రుద్ర శ్రీనివాస్ మాట్లాడుతూ, కామారెడ్డి డిక్లరేషన్‌లో 42% రిజర్వేషన్ చెప్పి, దానిలో 10% మైనార్టీలకు ఇవ్వడమేంటని అన్నారు. దీనికి నిరసనగా జరిగే ధర్నాలో వివిధ పార్టీల బీసీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొనాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్, మాజీ కౌన్సిలర్లు మాడవేణి నరేష్, పెండెం గణేష్, నాయకులు గుంపుకు సదాశివ్, చిరుమల్ల ధనుంజయ్, తిరుమల వాసు, ఎర్ర రాజేందర్, కంఠం ఉదయ్, బెక్కం అశోక్ తదితరులు పాల్గొన్నారు.
BJP Jagtial District President Rachakonda Yadagiri Babu strongly criticized the Telangana Congress government, stating that it has failed to fulfill its promises to the Backward Classes (BCs). Speaking at a press meet held at the office of OBC Morcha State Vice President Rudra Srinivas in Korutla, he said the Congress is cheating BCs.
He called for massive participation from BC communities and BJP cadres in the BC Maha Dharna scheduled on August 2 at Indira Park, Hyderabad. He questioned how the BC population, which was 56% earlier, is now being shown as only 45%. He also objected to the inclusion of 10% minorities within the claimed 42% BC reservation and termed it as unjust.
He challenged the Congress to reveal how many ministers from the BC community are currently in the Assembly and asked why the promise of making a BC the Chief Minister was broken. He said BJP will continue to fight until the full 42% reservation for BCs is implemented.
Rudra Srinivas added that although the Congress mentioned 42% BC reservation in the Kamareddy Declaration, allocating 10% of that to minorities is unfair. He urged BC leaders and activists from various parties to participate in large numbers in the upcoming protest.
The meeting was attended by BJP town president Bingi Venkatesh, former councilors Madaveni Naresh, Pendem Ganesh, and leaders like Gunpuku Sadashiv, Chirumalla Dhanunjay, Tirumala Vasu, Erra Rajender, Kantham Uday, Bekkam Ashok, and others.