బిఆర్ఎస్, బీజేపీ పార్టీలకు బీసీలపై వ్యతిరేక ధోరణి ఉందని ఆరోపిస్తూ, వాటిని తెలంగాణ ప్రజలు పూర్తిగా తిరస్కరించబోతున్నారని ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ చెప్పారు.

BRS and BJP have an anti-BC mindset, and Telangana society is preparing to completely reject these parties, said Fishermen Corporation Chairman Mettu Saikumar.

హైదరాబాద్, జూలై 23:
బిఆర్ఎస్, బీజేపీ పార్టీలకు బీసీలను వ్యతిరేకించే డీఎన్ఏ ఉందని, రాష్ట్ర ప్రజలు ఈ రెండు పార్టీలను 100 అడుగుల లోతు గోతిలో పూడ్చిపెట్టబోతున్నారని ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ వ్యాఖ్యానించారు. బుధవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రామచందర్ రావు దొడ్డి దారిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయ్యాడా? అనే సందేహాలు కలుగుతున్నాయని అన్నారు. ఆయన బీసీలను కించపరుస్తూ అసంబద్ధంగా మాట్లాడుతున్నారని తీవ్రంగా విమర్శించారు.

బీజేపీలో బీసీ నేతలైన బండి సంజయ్, పాయల శంకర్, నిజామాబాద్ ఎంపీ అరవింద్, లక్ష్మణ్, ఈటెల రాజేందర్ ఇలా ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని ప్రశ్నించారు. రామచందర్ రావును బీజేపీలోని బీసీ నాయకులు గల్లా పట్టుకొని నిలదీయాలని డిమాండ్ చేశారు.

బీజేపీ బీసీలకు వ్యతిరేక పార్టీగా విస్తృతంగా భావన ఏర్పడిందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు బీజేపీని బహిష్కరించనున్నారని ఆయన తెలిపారు. బీసీల రిజర్వేషన్లపై బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు మళ్లీ వంకర వ్యాఖ్యలు చేస్తే, వారిని తెలంగాణలో తిరగనీయబోమని హెచ్చరించారు.
BRS and BJP have a DNA that opposes the Backward Classes (BCs), alleged Fishermen Corporation Chairman Mettu Sai Kumar. Speaking to the media at Gandhi Bhavan on Tuesday, he expressed disbelief at how Ramachander Rao became the Telangana BJP president, stating that his appointment seems to have happened through backdoor means.

He criticized Ramachander Rao for making derogatory remarks against BCs and questioned why BC leaders within the BJP—such as Bandi Sanjay, Payal Shankar, Nizamabad MP Arvind, Laxman, and Etela Rajender—have remained silent.

Sai Kumar demanded that BJP’s BC leaders confront Ramachander Rao for insulting the community. He declared that the BJP has no respect for BCs and that the community is preparing to boycott the party in upcoming local body elections.

He also warned that if BRS and BJP leaders continue to speak arrogantly about BC reservations, BCs will not allow them to move freely in Telangana.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *