కోయ భాషలో ముద్రించిన తొలిపెట్టణి శుభలేఖ — భద్రాచలం ఐటిడిఏ నుంచి అరుదైన వినూత్నం
Koya language wedding invitation unveiled — A unique initiative by Bhadrachalam ITDA

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీ సంస్కృతికి కొత్త ఊపిరి. తొలిసారిగా కోయ భాషలో ముద్రించిన పెళ్లి పత్రికను ఐటీడీఏ భద్రాచలం పీవో రాహుల్ ఆవిష్కరించారు.

A tribal cultural milestone unfolded in Bhadradri Kothagudem district as ITDA Bhadrachalam PO Rahul unveiled the first-ever wedding invitation printed entirely in the Koya language.

పాల్వంచ గ్రామానికి చెందిన ఆదివాసి యువకుడు కన్న రాజు, భద్రాచలం జగదీష్ కాలనికి చెందిన పూనే లక్ష్మీ శరణ్య వివాహం ఆగస్టు 3న నిశ్చయించగా, వారి వివాహ ఆహ్వాన పత్రికను పూర్తిగా కోయ భాషలో ముద్రించారు. ఈ శుభలేఖపై “పందీర్ ముహూర్తం”, “మా సొంత నార్”, “కబూర్” వంటి కోయ పదాలు చొప్పించి ప్రామాణికంగా తీర్చిదిద్దారు.

ఈ వినూత్న శుభలేఖను సోమవారం ఐటిడిఏ కార్యాలయంలో ప్రాజెక్టు అధికారి రాహుల్ ఐఏఎస్ ఆవిష్కరించారు. ఇది కోయ భాష దినోత్సవం నాడే జరగడం విశేషం. శుభలేఖపై ‘కోయ భాషలో పెళ్లి శుభలేఖ’ అని ముద్రించి, భాష పట్ల గౌరవాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా పీవో రాహుల్ మాట్లాడుతూ, కోయ భాషలో లిపి రూపంలో ఈ శుభలేఖను చూడటం సంతోషంగా ఉందన్నారు. గిరిజనుల మాతృభాషకు లిపి రూపం దొరకడం హర్షించదగినదని పేర్కొన్నారు. భద్రాచలం ఐటిడిఏ ద్వారా ఆదివాసి సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణ కోసం ట్రైబల్ మ్యూజియం, ప్రత్యేక అధ్యయనాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

వారి భాషపై కొత్తతరం గిరిజనులకు ఆసక్తి పెంచేందుకు ప్రభుత్వ పత్రికలు, ప్రశంసాపత్రాలు కూడా కోయ భాషలో ముద్రిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్ రాజ్, పరిపాలన అధికారి సున్నం రాంబాబు, గిరిజన మహిళలు, పురుషులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *