
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన నిహారిక కొణిదెల ప్రొడక్షన్ నెం.2 – సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా ఫ్యాంటసీ కామెడీ సినిమా
Niharika Konidela’s second production launched with pooja – Fantasy comedy film stars Sangeeth Shobhan, Nayan Sarika
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై నిహారిక కొణిదెల నిర్మిస్తున్న రెండవ చిత్రానికి బుధవారం నాడు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ గ్లాస్ హౌస్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఫ్యాంటసీ కామెడీ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించనుండగా, సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు.
The film, produced under Pink Elephant Pictures by Niharika Konidela, was officially launched with a pooja ceremony held on Wednesday at Annapurna Studios, Hyderabad. Directed by Manasa Sharma, the film stars Sangeeth Shobhan and Nayan Sarika in the lead roles.
ఈ సినిమాకు కథ, దర్శకత్వం మానస శర్మ అందించగా, స్క్రీన్‌ప్లే, సంభాషణలు మానస శర్మ, మహేష్ ఉప్పాల కలిసి రచించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా మన్యం రమేష్ బాధ్యతలు తీసుకున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టగా, వశిష్ట కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కళ్యాణ్ శంకర్ మొదటి సన్నివేశాన్ని దర్శకత్వం వహించారు.
The story is penned by director Manasa Sharma herself, with screenplay and dialogues co-written by Mahesh Uppala. Executive production is handled by Manyam Ramesh. Directors Nag Ashwin, Vasishta, and Kalyan Shankar graced the launch, with Nag Ashwin giving the first clap, Vasishta switching on the camera, and Kalyan Shankar directing the muhurtham shot.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై 15 నుంచి హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో మొదలవుతుంది. అనుదీప్ దేవ్ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి అన్వర్ అలీ ఎడిటర్‌గా, రాజు ఎడురోలు సినిమాటోగ్రఫర్‌గా, పుల్లా విష్ణు వర్దన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, విజయ్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా బాధ్యతలు చేపడుతున్నారు.
Regular shooting will begin on July 15 around Hyderabad. Music is composed by Anudeep Dev, editing by Anwar Ali, cinematography by Raju Edurolu, production design by Pulla Vishnu Vardhan, and action choreography by Vijay.
ఇతర ముఖ్య నటులుగా వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, సుఖ్వీందర్ సింగ్, అరుణ భిక్షు, రమణ భార్గవ్, వాసు ఇంటూరి, రోహిణి (జబర్దస్త్), రోహన్ (#90) నటించనున్నారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
Supporting the lead cast are actors like Vennela Kishore, Brahmaji, Tanikella Bharani, Ashish Vidyarthi, Getup Sreenu, Sukhwinder Singh, Aruna Bhikshu, Ramana Bhargav, Vasu Inturi, Rohini (Jabardasth), and Rohan (#90). More details will be announced soon.