కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

6 ఏళ్లలో రూ.20 వేల కోట్లకుపైగా అభివ్రుద్ది పనులు చేసిన:
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్ అభివృద్ధికి రూ.20 వేల కోట్లకుపైగా నిధులు – కేంద్ర మంత్రి బండి సంజయ్
Over ₹20,000 Cr Spent on Development in 6 Years – Union Minister Bandi Sanjay
గడిచిన ఆరు సంవత్సరాల్లో కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.20 వేల కోట్లకుపైగా నిధులు మంజూరు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. రవాణా, ఉపాధి హామీ, సడక్ యోజన వంటి పథకాలతో కరీంనగర్ ప్రాంతం అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు.
Over the past six years, more than ₹20,000 crore has been invested in the development of the Karimnagar Parliamentary constituency, stated Union Minister of State for Home Affairs, Bandi Sanjay Kumar. Emphasizing infrastructure and livelihood projects, he asserted that his efforts will continue in coordination with local MLAs, beyond party lines.
హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన బండి సంజయ్, స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో కలిసి రూ.78 లక్షల వ్యయంతో వీణవంక మండలంలో 18 సీసీ అంతర్గత రోడ్లను ప్రారంభించారు. అనంతరం గండ్రపల్లిలోనూ మరో రూ.78 లక్షలతో నిర్మించిన 13 అంతర్గత రోడ్లను ప్రారంభించారు.
During his visit to Huzurabad constituency, Bandi Sanjay jointly inaugurated 18 internal CC roads worth ₹78 lakh in Veenavanka mandal with local BRS MLA Kaushik Reddy. He later opened another set of 13 roads built at a similar cost in Gandrapalli and nearby villages.
బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ – “ఇప్పటి వరకు తీసుకొచ్చిన నిధులలో సింహభాగం గ్రామీణ ఉపాధి హామీ, ప్రధానమంత్రి సడక్ యోజన, సీఆర్ఐఎఫ్, జాతీయ రహదారుల విస్తరణ పథకాలకే చెందుతాయన్నారు. కరోనా కాలంలోనూ కేంద్రం నుంచి నిధులు రాబట్టిన విషయం గుర్తుంచుకోవాలి,” అన్నారు. ఇకపై కరీంనగర్ అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో ఉండేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
He reiterated that major allocations were used under MGNREGA, PMGSY, CRIF, and National Highway expansion. “Even during the pandemic, I brought substantial funds from the Centre. Now, as a Minister, I aim to make Karimnagar No.1 in development,” he affirmed.