ఖతర్ వెళ్లాల్సిన విమానంలో హఠాత్తుగా తలెత్తిన సాంకేతికలోపం
రన్ వే పై కదులుతూ కొంత దూరం వెళ్లి హఠాత్తుగా ఆగిపోయిన విమానం
అప్రమత్తమైన విమాన సిబ్బంది.. 324 మంది ప్రయాణికులు సురక్షితం
చెన్నై నుంచి ఖతర్ వెళ్లాల్సిన విమానంలో హఠాత్తుగా తలెత్తిన సాంకేతికలోపాన్ని వెంటనే గుర్తించినందువల్ల 336 మంది ప్రయాణికులు ప్రాణా పాయం నుంచి తప్పించుకున్నారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఖతర్ దేశ రాజధాని దోహా వెళ్లాల్సిన ఖతర్ ఎయిర్ లైన్స్ ప్రయాణికుల విమానం సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు బయల్దేరేందుకు సిద్ధంగా ఉంది. ఈ విమానంలో 324 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ఆ విమానం రన్ వే పై కదులుతూ కొంత దూరం వెళ్లి హఠాత్తుగా ఆగిపోయింది. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది విమానం ఇంజన్లో లోపం ఉన్నట్లు గుర్తించా రు. ఈ ఘటనపై విమానాశ్రయ కంట్రోల్ రూంకు సమాచారం అందజేశారు. అనంతరం ఆగిపోయిన విమానాన్ని రికవరీ వాహనం ద్వారా బయల్దేరి న స్థలానికే తీసుకెళ్లి నిలిపారు. విమానం టేకాఫ్?కు ముందే సాంకేతిక లోపాన్ని గుర్తించిన కారణంగా 336 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.