Minister Ponnam Congratulates 30 Indiramma Housing Beneficiaries for Telugu News and English News Scroll Down

ఇళ్ల లబ్ధిదారులకు అభినందనలు – మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, జూన్ 14:
ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా 30 మంది లబ్ధిదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం నుంచి వారికి నూతన గృహ నిర్మాణానికి విడతల వారిగా రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామని వెల్లడించారు.
ఇల్లు నిర్మాణం కోసం 8 ట్రాక్టర్ల ఇసుక ఉచితంగా అందించనున్నారు. లబ్ధిదారులు 400 నుంచి 600 చదరపు అడుగుల మధ్య గల స్థలంలో ఇల్లు పూర్తిచేయాలని సూచించారు. నిర్మాణ సామర్థ్యం లేని వారికి మహిళా సంఘాల ద్వారా రూ. 1 లక్ష రుణం అందుబాటులో ఉందని తెలిపారు.
“ఇది ప్రజా పాలన ప్రభుత్వంలో పదేళ్ల తర్వాత వస్తున్న ఇందిరమ్మ ఇల్లు. ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ ఇళ్ల నిర్మాణాన్ని త్వరితంగా పూర్తి చేసుకోగలరని ఆశిస్తున్నాం,” అని మంత్రి అన్నారు.
Hyderabad:
Minister Ponnam Prabhakar congratulated 30 beneficiaries of the Indiramma housing scheme. He stated that the Telangana government is providing a financial aid of ₹5 lakh in phases for home construction. Additionally, 8 tractor loads of sand will be given free of cost.
Homes must be completed within 400–600 sq. ft. Those lacking financial capacity will receive a ₹1 lakh loan through women self-help groups. He noted that this is the first time in 10 years that Indiramma houses are being sanctioned under a public welfare government.