30 ఏళ్ల మరువలేని జ్ఞాపకాలతో… పూర్వ విద్యార్థుల సమ్మేళనం…

జీవిత మజిలీలో ఎన్నో నూతన పరిచయాలు జరుగుతూనే ఉంటాయి.. కానీ బుడిబుడి అడుగులతో మొదలై, పదో తరగతి వరకు కలిసి చదువుకున్న స్నేహితులను ఎన్నటికీ మరువలేమంటూ, అలియాబాద్ ప్రభుత్వ పాఠశాల 1992- 93 విద్యా సంవత్సర పదో తరగతి విద్యార్థులు మరో మారు నిరూపించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట్ మండల పరిధి అలియాబాద్ గ్రామంలోనున్న అలియాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 1992-93 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులంతా కలిసి, వారు పదో తరగతి చదివి 30 ఏళ్ల పూర్తయినప్పటికీ, వారి జ్ఞాపకాలు ఇంకా పదిలంగానే ఉన్నాయని చెప్పకనే చెబుతూ అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. ఇక ఈ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనానికి తూముకుంట మున్సిపాలిటీలో పరిధిలోనున్న అలంకృత రిసార్ట్స్ వేదికయింది. ఈ సమ్మెళనంలో ముఖ్యంగా వారికి విద్య బోధన చేసిన గురువులను సన్మానించి, రాబోవు తరాలకు గురువు పై ఎంత గౌరవం ఉండాలో చెప్పకనే చెప్పారు. ముఖ్యంగా సదరు విద్యార్థులతో 10 విద్య సంవత్సరాల పాటు ప్రత్యేక అనుబంధమున్న నాటి ఉపాధ్యాయుడు మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి సమ్మేళనంలో పాల్గొని తన విద్యార్థులతో అలనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇక సమ్మేళనంలో మాజీ ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి, ఉపాధ్యాయులు ఇన్నారెడ్డి, వాస కృష్ణ, సులోచన, దామోదర్, కేశ్వానాథ్ పాల్గొన్నారు. ముక్యంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని అద్భుతంగా నిరవహించిన ఆర్గనైజర్లైనా దశరథ్, మురళి గౌడ్, సుధాకర్ రెడ్డి, నరేష్ గౌడ్, వేణుగోపాల్ రెడ్డి, రఘునాథ్ పంతులు, పెద్ద శ్రీనివాస్, రాములు, తుమ్మ గోపాల్, వెంకటేష్, విట్టల్, రాపోలు శ్యామల, కొండల్ రెడ్డి తోపాటుగా పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *