దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వ్యవహారం చర్చనీయాంశంగా మారిన వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌సీపీ నేత మహమ్మద్‌ ఫైజల్‌పై గతంలో వేసిన అనర్హత వేటును లోక్‌సభ సచివాలయం ఎత్తివేసింది. ఆయనపై అనర్హతను ఉపసంహరించుకుంటున్నట్లు, ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు లోక్‌సభ సెకట్రేరియట్‌  బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. తన అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే.. ఈ నోటిఫికేషన్‌ రావడం గమనార్హం. 

అసలేం జరిగిందంటే.. 2009లో కాంగ్రెస్‌ నాయకుడు మహ్మద్‌ సలీప్‌ాపై దాడి చేశారన్న కేసులో ఈ ఏడాది జనవరి 10న లక్షద్వీప్‌ ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌ను కవరత్తీ సెషన్స్‌ కోర్టు దోషిగా తేల్చింది. పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. తీర్పు వెలువడిన మూడు రోజుల తర్వాత (జనవరి 13న) లోక్‌సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేస్తూ ప్రకటన జారీ చేసింది. ఫైజల్‌ కేరళ హైకోర్టును ఆశ్రయించడంతో సెషన్స్‌ కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో ఆయనపై పడిన అనర్హత వేటు చెల్లుబాటు కా కుండా పోయింది. అయినప్పటికీ.. ఫైజల్‌ సభ్యత్వాన్ని లోక్‌సభ సచివా లయం పునరుద్ధరించలేదు. దీన్ని సవాల్‌ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై నేడు సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో.. ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధ రించడం గమనార్హం. కాగా.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వ అనర్హతపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం అత్యంత ప్రాధాన్యత సంతరించు కుంది. రాహుల్‌ గాంధీ కేసులో ఇది ప్రభావం చూపించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *