20 Lost Mobile Phones Recovered by Shamirpet Police in Medchal District

మేడ్చల్ జిల్లా: మొబైల్స్ ఫోన్ లు పోగొట్టుకున్నట్లుగా 32 ఫిర్యాదులు రాగా, అందులో 20 మొబైల్ ఫోన్ లను శామీర్ పేట పోలీసులు రికవరీ చేశారు. మొబైల్ ఫోన్లు పోయాయంటూ శామీర్ పేట పోలీస్ స్టేషన్ కు మొత్తం 32 ఫిర్యాదులు రాగా, అందులో 20 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి సదరు బాధితులకు జవహర్ నగర్ డివిజన్ ఏసీబీ చక్రపాణి, శామీర్ పేట సీఐ శ్రీనాథ్, అడ్మిన్ ఎస్ఐ సోమిరెడ్డి 20 మొబైల్ ఫోన్లను వారి వారికి అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 32 ఫిర్యాదులను సి ఈ ఐ ఆర్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేశామని తెలిపారు. వారాంతపు సంతల్లో జనం గూడి ఉన్నచోట ఏమనపాటుగా ఉండకుండా అప్రమత్తంగా ఉండడం వల్ల మొబైల్ ఫోన్లు పోగొట్టుకోకుండా ఉండవచ్చు అన్నారు. ఒకవేళ మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే సి ఈ ఐ ఆర్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఫిర్యాదులను నమోదు చేయడం ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ లభించే అవకాశాలు అత్యధికంగా ఉంటాయన్నారు. పోగొట్టుకున్న తమ మొబైల్ ఫోన్లు తిరిగి రావు అనుకున్న బాధితులకు తిరిగి మొబైల్ ఫోన్లు రావడంతో వారు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.
Full English News Article
Shamirpet Police in Medchal district achieved a significant success in tracing lost mobile phones reported by the public. A total of 32 complaints were registered regarding missing mobile phones, out of which police successfully recovered 20 devices.
The recovered mobile phones were handed over to the respective victims by Jawaharnagar Division ACP Chakrapani, Shamirpet CI Srinath, and Admin SI Somireddy. Victims, who had almost lost hope of getting their phones back, expressed gratitude to the police for their efforts.
According to police officials, all complaints were registered through the CEIR (Central Equipment Identity Register) online portal, which helped in efficiently tracking the devices. They stated that using the portal significantly improves the chances of recovery.
Police also advised the public to remain alert in crowded places such as weekly markets and public gatherings. Negligence in such areas increases the risk of losing mobile phones.
They further urged citizens to immediately file a complaint through the CEIR portal if a mobile phone is lost, as timely reporting increases the chances of successful recovery.