2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి… రేవంత్ రెడ్డి..

ఈ నెల 8న సరూర్ నగర్ లో సాయంత్రం 3 గంటలకు యువ సంఘర్షణ సభ ఏర్పాటు చేయబోతున్నాం. ప్రియాంక గాంధీ ఈ సభలో పాల్గొని హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారు. వరంగల్ రైతు సంఘర్షణ సభలో రైతు డిక్లరేషన్ రాహుల్ ప్రకటించారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. తెలంగాణలో 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు చేసిందికానీ చర్యలు లేవని విమర్శించారు. చివరకు టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలు సంతలో సరుకుల మార్చేశారుని ఎద్దేవా చేసారు. వందల కోట్లకు లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో 2లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేసీఆర్ పాలనలో రైతులు, నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు. టీఆరెస్ ను బీఆరెస్ గా మార్చి పార్టీ విస్తరణకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ మోడల్ కు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. ఐటీ ఉద్యోగం వదిలేసి శరద్ మడ్కర్ అనే వ్యక్తి బీఆరెస్ లో చేరారని పత్రికల్లో ప్రచారం చేసుకున్నారు. ఏప్రిల్ 10న బీఆరెస్ లో చేరిన అతనికి మే 2న సీఎం ప్రైవేటు సెక్రెటరీగా నియమించారు. ఇందుకు సంబంధించిన జీవోను రహస్యంగా ఉంచారు. సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయని కేసీఆర్ పక్క రాష్ట్రంలో వాళ్ళను తెచ్చి పెట్టుకుంటున్నారు. పరాయి రాష్ట్రంలో పరపతి పెంచుకునేందుకు కిరాయి మనుషులను తెచ్చి పెట్టుకుంటున్నారని విమర్శించారు. ఎవరి సొమ్మని ఏడాదికి 18లక్షలు అతనికి జీతం ఇస్తున్నారన్నారు. తక్షణమే ఈ జీవోను రద్దు చేయాలి డిమాండ్ చేసారు. తెలంగాణలోని 20లక్షల విద్యార్థులకు, 30లక్షల నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నా 8న జరిగే యువ సంఘర్షణ సభకు తరలిరండి అని పిలుపునిచ్చారు. రైతు డిక్లరేషన్ లా సరూర్ నగర్ సభలో యూత్ డిక్లరేషన్ ను ప్రియాంక గాంధీ ప్రకటిస్తారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *