హైదరాబాద్ : ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా నగరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 125 అడుగుల ఎత్తైన రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవాన్నిపురస్కరించుకొని వివిధ రంగాల్లో రాణించిన వారికి అంబేద్కర్ విద్యా వికాస్ మెరిట్ అవార్డులను అందజేయనున్నట్లు జియాగూడ మాజీ కార్పొరేటర్, మిత్ర అసోసియేట్స్ చైర్మన్ మిత్ర కృష్ణ పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీన ఉదయం 11 గంటలకు జియాగూడలోని ఎన్డీఏ గార్డెన్స్‌లో జరిగే అంబేద్కర్ విద్యా వికాస్ అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేయాల్సిందిగా కోరుతూ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం పలికినట్లు మిత్ర కృష్ణ తెలిపారు. తమ ఆహ్వానానికి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని ఆయన వెల్లడిరచారు. ఈ అవార్డులను రాష్ట్ర వ్యాప్తంగా విద్యా, కళలు, క్రీడల్లో రాణిస్తున్న మెరిట్ విద్యార్థులు, క్రీడాకారులు, కళాకారులకే కాకుండా సామాజిక సేవలు అందిస్తున్న వివిధ సంఘాలు, కుల సంఘాలు, సంక్షేమ సంఘాలు, యువజన సంఘాలు, ఉత్తమ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు, ఉత్తమ రాజకీయవేత్తలకు, ఉత్తమ జర్నలిస్టులకు, అన్ని రంగాల వారికి ఈ అవార్డులను మంత్రి కేటీఆర్ చేతుల విూదుగా అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పలువురు ప్రముఖులు విచ్చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.